Pages

Patta Sub Division - పట్టా సబ్ డివిజన్ విధానం ,అర్హత ప్రమాణం ,కావాల్సిన పత్రాలు , అప్లికేషను ఫారం

Patta Sub Division
Patta Sub Division అనగా
  • ఈ సేవ నే Online Sub Division అని కూడా అంటారు .

  • భూమిని చిన్న ముక్కలుగా విభజించే ప్రక్రియను Patta Sub Division అంటారు.

  • మీకు ఒక సర్వే నెంబర్ మీద భూమి ఉండి , ఆ యొక్క భూమిని మీరు పంచుకున్న యెడల మీరు భూమిని సబ్ డివిజన్ చెయ్యడం ద్వారా సర్వేయర్ వారు సర్వే చేసిన తరువాత ,ఆ రిపోర్ట్ ప్రకారం తహసీల్దార్ గారు వేబ్లాండ్ నందు నమోదు చేస్తారు.

  • ఉదాహరణకు మీకు 120 వ సర్వే నెంబర్ మీద ఒక రెండు ఎకరాలు భూమి ఉంది. ఒక ఇద్దరు సమానంగా ఆ భూమిని పంచుకున్నారు.అప్పుడు భూమిని సబ్ డివిజన్ చేసుకున్న యెడల మీకు రెండు సర్వే నెంబర్ లు ఏర్పడి 120-1లో ఒక ఎకరా మరియు 120-2 లో ఒక ఎకరాగా సర్వేయర్ వారు సర్వే చేసిన తరువాత ,ఆ రిపోర్ట్ ప్రకారం తహసీల్దార్ గారు వేబ్లాండ్ నందు నమోదు చేస్తారు.

  • Patta Sub Division లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.
    1. Patta Subdivision (పట్టా సబ్ డివిజన్) : మీ యొక్క భూమి ఉన్న ప్రాంతం రీ సర్వే గనుక జగకపోతే మీ యొక్క సర్వే నంబరు ద్వారా మీ యొక్క భూమిని పట్టా సబ్ డివిజన్ చేసుకోవచ్చు.
    2. Online Subdivision (ఆన్‌లైన్ సబ్ డివిజన్ ) : మీ యొక్క భూమి ఉన్న ప్రాంతం రీ సర్వే గనుక జరిగి ఉంటే మీ యొక్క LPM నంబరు ద్వారా మీ యొక్క భూమిని పట్టా సబ్ డివిజన్ చేసుకోవచ్చు .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయ కార్యాలయాల్లో ఈ సేవకు దరకాస్తు చేసుకోవచ్చును.

  • Patta Sub Division - పట్టా సబ్ డివిజన్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టా సబ్ డివిజన్ చేసుకోవాలి అనుకున్న వారు ఆ భూమికి హక్కు దారులు అయ్యి ఉండాలి.

  • ఆ భూమి యొక్క హద్దుదారుల యొక్క పేర్లు ,చిరునామా ,మొబైల్ నెంబర్ మరియు వారి యోక్క్ అడ్రస్ తెలుసుకొని ఉండాలి.

  • ఆ భూమి పొరుగున ఉన్న పట్టాదార్లకు ఉమ్మడి సరిహద్దుకు సంబంధించి ఉపవిభజనకు మరియు ఉపవిభజన ప్రకటనలో సంతకం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండాలి.

  • ఉమ్మడి ఆస్తి విషయంలో వాటాదారులందరూ పట్టా సబ్ డివిజన్ కి సమ్మతి ఇవ్వాలి.

  • దరఖాస్తుదారు భూమిపై క్లియర్ కట్ టైటిల్‌ను సమర్పించాలి.

  • టైటిల్ మరియు స్వాధీనానికి సంబంధించి కోర్టు కేసు లేని చోట పట్టా డివిజన్ ని చేపట్టవచ్చు.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జెరాక్స్*

  • దరఖాస్తుదారుని పట్టాదారు జెరాక్స్ *

  • అడంగాలు నకలు *


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Patta Sub Division (పట్టా సబ్ డివిజన్ ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment