Pages

Mutation of Pattadar Passbook - భూమి బదలాయింపు కు కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mutation and Automatic Pattadar Passbook Ordering
Mutation of Pattadar Passbook అనగా
  • ఈ సేవ నే Mutation and Automatic Pattadar Passbook Ordering అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి భూమి వేరు వేరు విధాల సంక్రమించి మరియు వేబ్లాండ్ నందు లేని యెడల ఈ సేవ ద్వారా వేబ్లాండ్ లో నమోదు చేసుకోవచ్చు.

  • ఈ సేవ ద్వారా మీరు పట్టాదారు పాసు పుస్తకం నేరుగా మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పొందవచ్చును.

  • భూమి సంక్రమించే విధానాలు :
    • పూర్వీకుల ఆస్తి వారసత్వం ద్వారా
    • వీలుణామా ద్వారా
    • కొనుగోలు వంటి స్వతహాగా సముపార్జన ద్వారా
    • గిఫ్ట్, ట్రస్ట్, సెటిల్మెంట్ డీడ్స్ ద్వారా
    • ప్రభుత్వం ద్వారా గ్రాంట్, ఇనామ్ ద్వారా
    • Partition deed ద్వారా
    • కోర్టు డిక్రీ ద్వారా

  • మ్యుటేషన్ మరియు ఆటోమేటిక్ పట్టాదార్ పాస్‌బుక్ ఆర్డరింగ్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి తప్పనిసరిగా వారికి పైన చెప్పిన విధాలలో ఏదో ఒక విధంగా ఆస్తి సంక్రమించి ఉండాలి.

  • పొలం ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.

  • పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోదలచుకున్న వారు వారి యొక్క ఆదార్ మరియు మొబైల్ నెంబర్ కు లింక్ అయ్యి ఉండాలి లేదా పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోదలచుకున్న వ్యక్తి తన యొక్క బయోమెట్రిక్ దృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం అమ్మిన వారి యొక్క పాసు పుస్తకం నకలు / ROR-1B *

  • పొలం కొన్న వారి యొక్క పాసు పుస్తకం నకలు / ROR-1B

  • రిజిస్ట్రేషన్ పత్రాలు (రిజిస్ట్రేషన్ జరిగితే)*

  • కొన్నవారి/వారసుడి యొక్క పాసుపోర్టు సైజు ఫోటో *

  • కొన్నవారి/వారసుడి యొక్క సంతకం *

  • మరణ ద్రువికరణ పత్రం ( వారసత్వం అయితే)*

  • ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికేట్ ( వారసత్వం అయితే)*


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mutation and Automatic Pattadar Passbook Ordering ( పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment