Our Softwares
Schemes - Services - Details
Application Forms
Important Websites
Important Apps
Dashboards & Status Check

Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం ) Application Process in Andhra Pradesh

Vahan Mitra Scheme 2025
Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం ) అనగా
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లను ఆదుకునేందుకు వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినది.

  • .ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు.

  • వాహన మిత్ర పథకం యొక్క నగదు వాహనం యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా, మరమ్మతులు వంటి అవసరాల కోసం అక్కరకు వచ్చేలా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

  • అక్టోబర్ 1న వాహనమిత్ర నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

  • వాహన మిత్ర పథకం లో ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లు ఈ క్రింది నమోదు చేసుకోవచ్చు.

    1. వాహన మిత్ర పథకం కొరకు మీ యొక్క గ్రామా మరియు వార్డు సచివాలయం ద్వారా తగు పత్రాలు తీసుకొని వెళ్లి సెప్టెంబర్ 17 వ తారీఖు నుండి దరకాస్తు చేసుకోవచ్చు .



అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  1. నిరుపేద కుటుంబానికి చెంది ఉండి 3 ఎకరాల లోపు తడి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి. .

  2. టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.

  3. కుటుంబంలో పెన్షనర్‌ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు.

  4. ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.

  5. కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  6. ఒక లబ్దిదారునికి రెండు లేదా అంత కంటే ఎక్కువ వాహనాలు ఉన్న సరే , ఒక్క వాహనానికి మాత్రమే వాహన మిత్ర పథకం వర్తిస్తుంది.

  7. మున్సిపల్ ఏరియా లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉండరాదు.

  8. లబ్దిదారునికి వాహనం మీద ఎటువంటి చలనాలు పెండింగ్ ఉండరాదు.

  9. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

  10. ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.

  11. వాహనం ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్ అయి ఉండాలి.

  12. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి.

  13. ఆటో రిక్షా విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే, ఈ ఒక్క సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు.కానీ, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

  14. గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి.

  15. దరఖాస్తుదారు వృత్తి సమూహాలకు సంబంధించిన మరే ఇతర GoAP పథకం కింద లబ్ధిదారుడిగా ఉండకూడదు.

  16. ఒకే కుటుంబలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ లబ్దిదారులు వేర్వేరు స్వంత వాహనాలు మరియు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్న యెడల వారందరూ అర్హులే.

  17. లబ్దిదారుడు తప్పనిసరిగా BPL కుటుంబానికి చెందిన వారు అయ్యి రేషన్ కార్డు ఉండవలెను.

  18. లబ్దిదారునికి స్వంత వాహనం ఉండవలెను (RENT / LEASE కు తీసుకున్న వారు అనర్హులు).


దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  1. దరకాస్తు ఫారం

  2. లబ్దిదారుని యొక్క ఆధార్ కార్డు జెరాక్స్

  3. లబ్దిదారుని యొక్క రైస్ కార్డు జెరాక్స్

  4. లబ్దిదారుని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ జెరాక్స్

  5. లబ్దిదారుని వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్.సి) జెరాక్స్

  6. లబ్దిదారుని యొక్క బ్యాంకు అకౌంట్ జెరాక్స్

  7. లబ్దిదారుని యొక్క ఆధార్ కు లింకు ఐన మొబైల్ నెంబర్


ముఖ్యమైన తేదీలు (Imp.Dates)
  1. 13-09-2025 : 2023-24 లో ఆర్థిక సహాయం పొందిన వాహన మిత్ర లబ్ధిదారులను GSWS విభాగం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ.

  2. 15-09-2025 : 2023-24 లో ఆర్థిక సహాయం పొందిన వాహన మిత్ర లబ్ధిదారుల పూర్తి సమాచారం ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంటు వారు GSWS విభాగానికి వెరిఫికేషన్ కొరకు సమర్పించుట.

  3. 17-09-2025 : క్రొత్త వాహన మిత్ర లబ్ధిదారుల దరకాస్తులు గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం.

  4. 19-09-2025 : క్రొత్త వాహన మిత్ర లబ్ధిదారుల దరకాస్తులు గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ముగింపు.

  5. 22-09-2025 : వాహన మిత్ర లబ్ధిదారుల వెరిఫికేషన్(సచివాలయ ,మండల మరియు జిల్లా స్థాయి) ముగింపు.

  6. 24-09-2025 : వాహన మిత్ర లబ్ధిదారుల తుది జాబితా తయారి మరియు GSWS డిపార్టుమెంటు వారు కార్పొరేషన్ వారిగా జాబితాను ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంటు వారికి పంపుట.

  7. 01-10-2025 : గౌరవ ముఖ్య మంత్రి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేతుల మీదుగా వాహన మిత్ర నిధులను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయుట.


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


CONCLUSION (ముగింపు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఎవ్వరైనా స్వంతంగా ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ కలిగి ఉండి మరియు పైన తెలిపిన అర్హతలన్నీ ఉన్న యెడల, పైన తెలిపిన పత్రాలు తీసుకొని వెళ్లి , మీ యొక్క హౌసేహోల్ద్ మాపింగ్ ఏ గ్రామ / వార్డ్ సచివాలయంలో అయితే ఉంటుందో ఆ గ్రామ / వార్డ్ సచివాలయముకు వెళ్లి సెప్టెంబర్ 19 తారీఖు లోపల దరకాస్తు చేసిన యెడల అక్టోబర్ 1 తారీఖు నాడు నేరుగా మీ యొక్క ఖాతాలో 15000 వాహన మిత్ర లభ్ది పొందవచ్చును.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Nano Banana's Creation process through GOOGLE GEMINI AI

Nano Bananas creation process through GOOGLE GEMINI AI
Nano Banana AI image creation అనగా
  • Nano Bananas అనునవి డిజిటల్ 3D బొమ్మలు, సాధారణంగా చిన్నవిగా, మెరుగుపెట్టినవి మరియు కార్టూన్ లాగా కనిపిస్తాయి.

  • చేతితో తయారు చేసిన సేకరణల మాదిరిగా కాకుండా, ఇవి పూర్తిగా కృత్రిమ మేధస్సు ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.

    1. Nano Bananas ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ మరియు X లలో వ్యాపించాయి. అక్కడ వినియోగదారులు పెంపుడు జంతువుల నుండి ప్రజా వ్యక్తుల వరకు ప్రతిదాన్ని సూక్ష్మ రూపంలో పునఃసృష్టించవచ్చు.

    2. ఈ క్రింద తెలిపిన విధంగా Nano Bananas ను గూగుల్ జెమినీ AI ను ఉపయోగించి మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు.


Nano Bananas సృష్టించడానికి కావలసినవి
  • ఇంటర్నెట్ కలిగన స్మార్ట్ ఫోన్ .

  • ఫోటో /వీడియో .

  • తగిన PROMPT .


Nano Bananas తయారి విధానం (Nano Bananas CREATION PROCESS )
  1. Nano Bananas తయారి కొరకు ముందుగా సెర్చ్ ఇంజిన్ LIKE GOOGLE లో GOOGLE GEMINI AI అని సెర్చ్ చేయండి.
    koushalam
    మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.

  2. తదుపరి పైన రౌండ్ చేసిన లింక్ పైన క్లిక్ చెయ్యండి. koushalam
    మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.


  3. nanobanana
    మీరు పై విధంగా nano banana రూపొందించడానికి ఈ క్రింది PROMPT ను COPY చెయ్యండి.
    nanobanana
    మీకు పై విధంగా nano banana రూపొందించడానికి ఈ క్రింది PROMPT ను COPY చెయ్యండి.


  4. మీరు క్రింద రౌండ్ చేసిన టెక్స్ట్ బాక్స్ లో మీరు పైన కాపీ చేసిన PROMPT ను PASTE చేసి ఆ " + " SYMBOL మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ను upload చేసి ">" మీద చెయ్యండి అంతే మీకు పైన చూపిన విధంగా మీ యొక్క NANO BANANA ను GOOGLE GEMINI AI కొద్ది క్షణాలలోనే మీకు అందిస్తుంది. koushalam


CONCLUSION (ముగింపు)

ఈ సాధనం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఉపయోగం సాధారణ ఫోటోలు లేదా టెక్స్ట్ ప్రాంప్ట్‌లను హైపర్-రియలిస్టిక్ 3D బొమ్మలుగా మార్చడం.

"నానో బనానా" అనేది గూగుల్ యొక్క జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ కు పెట్టబడిన ముద్దుపేరు, ఇది ఒక శక్తివంతమైన AI-ఆధారిత ఇమేజ్-ఎడిటింగ్ సాధనం. "నానో బనానా" అనే పేరు గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు బనానా-నేపథ్య టీజర్‌ల శ్రేణి నుండి ఉద్భవించింది మరియు అప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Koushalam కౌశలం Registration Process in Andhra Pradesh

Koushalam కౌశలం (వర్క్ ఫ్రమ్ హోమ్)
Koushalam కౌశలం(వర్క్ ఫ్రమ్ హోమ్) అనగా
  • నిరుద్యోగులు, విద్యార్థుల నైపుణ్య స్థాయిలను అంచనా వేసి, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగాలను కల్పించడం కొరకు ఈ కౌశలం ఉపయోగపడుతుంది.

  • ఈ కౌశలంలో ఆంధ్రప్రదేశ్ యువత రెండు రకాలుగా నమోదు చేసుకోవచ్చు.

    1. మీ దగ్గర లోని గ్రామా మరియు వార్డు సచివాలయం ద్వారా మీ యొక్క సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్లి నమోదు చేసుకోవచ్చు.

    2. ఈ క్రింద తెలిపిన విధంగా ఆంధ్రప్రదేశ్ యువత డైరెక్ట్ గా మీ ఇంటి వద్ద నుండే నమోదు చేసుకోవచ్చు.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా నుంచి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు అర్హులు.


దరకాస్తు విధానం (REGISTRATION PROCESS )
  1. కౌశలం నమోదు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి .
    koushalam
    CLICK HERE పక్కన ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేసిన తరువాత , మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.

  2. మీరు క్రింద రౌండ్ చేసిన టెక్స్ట్ బాక్స్ లో మీ యొక్క ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP మీద క్లిక్ చెయ్యండి. koushalam

  3. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి OK బటన్ మీద క్లిక్ చెయ్యండి. koushalam


  4. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీ మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి SUBMIT బటన్ మీద క్లిక్ చెయ్యండి. koushalam


  5. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీ యొక్క మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి GET OTP మీద క్లిక్ చెయ్యండి. koushalam


  6. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీ మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి OK బటన్ మీద క్లిక్ చెయ్యండి. koushalam


  7. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీ యొక్క E-MAIL ID ను ఎంటర్ చేసి GET OTP మీద క్లిక్ చెయ్యండి. koushalam


  8. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీ E-MAIL ID కు వచ్చిన OTP ఎంటర్ చేసి OK బటన్ మీద క్లిక్ చెయ్యండి. koushalam


  9. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీకు వచ్చిన భాషల (LANGUAGES) పక్కన ఉన్న చెక్ బాక్స్ మీద మాత్రమే క్లిక్ చెయ్యండి. koushalam


  10. మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ,కోర్స్ స్టేటస్ , ఫీల్డ్ అఫ్ స్టడీ ,CGPA ,ఏ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసారు,ఎక్కడ చదివారు మరియు మీ యొక్క సర్టిఫికేట్ upload చేసి SUBMIT బటన్ మీద క్లిక్ చెయ్యండి.అంతే మీరు విజయవంతంగా కౌశలం కు రిజిస్టర్ అయినట్లే. koushalam



CONCLUSION (ముగింపు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 వ తరగతి ,ఇంటర్ ,డిప్లొమా , డిగ్రీ మరియు పీ.జీ వరకు విధ్యా అర్హత కలిగి వున్న వారు నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధీ అవకాశాల కోసం పైన తెలిపిన రెండు పద్దతులలో ఏ పద్దతిలో నైనా సరే రెజిస్టర్ చేసుకున్న యెడల మీకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించే ప్రతి ఒక్క అవకాశం నేరుగా మీ యొక్క మొబైల్ మరియు మెయిల్ ID కు పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

L.P.C,DUTY,Non-Drawl,GIS,Service Verification Certificates Generator for Tanguturu VS Employees

GSWS Transfer/Relieving Certificates Generator from APPSDA
GSWS Transfer/Relieving Certificates Generator
(Exclusively for TANGUTURU Grama Ward Sachivalayam Employees) Designed & Developed By Madhusudhanrao Kamma ,Developer & Designer of www.regularinnovations.in and www.appsda.in
Enter Your Name :

Enter S/o,D/o,W/o of Sri/Smt :

Enter Your Designation :

Select Your Sachivalayam :

Select First Joining Date (in Tanguturu) :
: :
Enter Your Proc.No.:

Select Your Proc.Date. :
: :
Enter Your Proc. Issuing Authority:

Enter Your Proc. Issuing District Name :

Enter Relieving Date :
: :
Salary Paid Upto (at TANGUTUR):
: :
Enter CFMS ID :

Enter HRMS ID :

Select Pay Scale :

Enter Salary Credited A/C No :

Enter Bank Name :

Entitlement of Leaves (Balance):

C.L S :   O.H :

CCLS :   SCLS :
Select Date From which you want Non-Drawl :
: :
Select Date UPTO which you want Non-Drawl :
: :
Select LPC ,Non-Drawl,Duty Date Taking Date (Printed on Bottom of Certificate) :
: :
Enter Basic Pay : *

Note :* For P.S / ADMIN : 23120,23780,24500,25220 Etc ; For Other Staff : 22460,23120,23780,24500 Etc

Enter E.H.S Amount :*
Enter APGLI Subscription Amount : *

Set Page Size to ISO A4 While SAVING to get Perfect Certificates.

మేము తయారు చేసిన మిగిలిన అన్ని ప్రోగ్రాములు/అప్లికేషన్లను చూడడానికి ఇక్కడ నొక్కండి.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Charge Handover Check List Generator


Service Verification Certificate Generator

Set Page Size to ISO A4 While SAVING to get Perfect Certificates.