Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం ) Application Process in Andhra Pradesh

Vahan Mitra Scheme 2025
Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం ) అనగా
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లను ఆదుకునేందుకు వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినది.

  • .ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు.

  • వాహన మిత్ర పథకం యొక్క నగదు వాహనం యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా, మరమ్మతులు వంటి అవసరాల కోసం అక్కరకు వచ్చేలా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

  • అక్టోబర్ 1న వాహనమిత్ర నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

  • వాహన మిత్ర పథకం లో ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లు ఈ క్రింది నమోదు చేసుకోవచ్చు.

    1. వాహన మిత్ర పథకం కొరకు మీ యొక్క గ్రామా మరియు వార్డు సచివాలయం ద్వారా తగు పత్రాలు తీసుకొని వెళ్లి సెప్టెంబర్ 17 వ తారీఖు నుండి దరకాస్తు చేసుకోవచ్చు .



అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  1. నిరుపేద కుటుంబానికి చెంది ఉండి 3 ఎకరాల లోపు తడి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి. .

  2. టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.

  3. కుటుంబంలో పెన్షనర్‌ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు.

  4. ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.

  5. కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  6. ఒక లబ్దిదారునికి రెండు లేదా అంత కంటే ఎక్కువ వాహనాలు ఉన్న సరే , ఒక్క వాహనానికి మాత్రమే వాహన మిత్ర పథకం వర్తిస్తుంది.

  7. మున్సిపల్ ఏరియా లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉండరాదు.

  8. లబ్దిదారునికి వాహనం మీద ఎటువంటి చలనాలు పెండింగ్ ఉండరాదు.

  9. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

  10. ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.

  11. వాహనం ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్ అయి ఉండాలి.

  12. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి.

  13. ఆటో రిక్షా విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే, ఈ ఒక్క సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు.కానీ, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

  14. గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి.

  15. దరఖాస్తుదారు వృత్తి సమూహాలకు సంబంధించిన మరే ఇతర GoAP పథకం కింద లబ్ధిదారుడిగా ఉండకూడదు.

  16. ఒకే కుటుంబలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ లబ్దిదారులు వేర్వేరు స్వంత వాహనాలు మరియు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్న యెడల వారందరూ అర్హులే.

  17. లబ్దిదారుడు తప్పనిసరిగా BPL కుటుంబానికి చెందిన వారు అయ్యి రేషన్ కార్డు ఉండవలెను.

  18. లబ్దిదారునికి స్వంత వాహనం ఉండవలెను (RENT / LEASE కు తీసుకున్న వారు అనర్హులు).


దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  1. దరకాస్తు ఫారం

  2. లబ్దిదారుని యొక్క ఆధార్ కార్డు జెరాక్స్

  3. లబ్దిదారుని యొక్క రైస్ కార్డు జెరాక్స్

  4. లబ్దిదారుని యొక్క డ్రైవింగ్ లైసెన్స్(D.L) జెరాక్స్

  5. లబ్దిదారుని వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (R.C) జెరాక్స్

  6. లబ్దిదారుని యొక్క బ్యాంకు అకౌంట్ జెరాక్స్

  7. లబ్దిదారుని వాహనం యొక్క ఫిట్నెస్ దృవీకరణ పత్రం(Fitness Certificate) జెరాక్స్

  8. లబ్దిదారుని వాహనం యొక్క టాక్స్ దృవీకరణ పత్రం (Vehicle Tax) జెరాక్స్

  9. లబ్దిదారుని యొక్క ఆధార్ కు లింకు ఐన మొబైల్ నెంబర్

  10. లబ్దిదారుని యొక్క కుల మరియు ఆదాయ దృవీకరణ పత్రం జెరాక్స్

  11. లబ్దిదారుని వాహనం యొక్క ఇన్సూరెన్స్ జెరాక్స్ (optional)


ముఖ్యమైన తేదీలు (Imp.Dates)
  1. 13-09-2025 : 2023-24 లో ఆర్థిక సహాయం పొందిన వాహన మిత్ర లబ్ధిదారులను GSWS విభాగం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ.

  2. 15-09-2025 : 2023-24 లో ఆర్థిక సహాయం పొందిన వాహన మిత్ర లబ్ధిదారుల పూర్తి సమాచారం ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంటు వారు GSWS విభాగానికి వెరిఫికేషన్ కొరకు సమర్పించుట.

  3. 17-09-2025 : క్రొత్త వాహన మిత్ర లబ్ధిదారుల దరకాస్తులు గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం.

  4. 19-09-2025 : క్రొత్త వాహన మిత్ర లబ్ధిదారుల దరకాస్తులు గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ముగింపు.

  5. 22-09-2025 : వాహన మిత్ర లబ్ధిదారుల వెరిఫికేషన్(సచివాలయ ,మండల మరియు జిల్లా స్థాయి) ముగింపు.

  6. 24-09-2025 : వాహన మిత్ర లబ్ధిదారుల తుది జాబితా తయారి మరియు GSWS డిపార్టుమెంటు వారు కార్పొరేషన్ వారిగా జాబితాను ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంటు వారికి పంపుట.

  7. 01-10-2025 : గౌరవ ముఖ్య మంత్రి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేతుల మీదుగా వాహన మిత్ర నిధులను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయుట.


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


CONCLUSION (ముగింపు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఎవ్వరైనా స్వంతంగా ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ కలిగి ఉండి మరియు పైన తెలిపిన అర్హతలన్నీ ఉన్న యెడల, పైన తెలిపిన పత్రాలు తీసుకొని వెళ్లి , మీ యొక్క హౌసేహోల్ద్ మాపింగ్ ఏ గ్రామ / వార్డ్ సచివాలయంలో అయితే ఉంటుందో ఆ గ్రామ / వార్డ్ సచివాలయముకు వెళ్లి సెప్టెంబర్ 19 తారీఖు లోపల దరకాస్తు చేసిన యెడల అక్టోబర్ 1 తారీఖు నాడు నేరుగా మీ యొక్క ఖాతాలో 15000 వాహన మిత్ర లభ్ది పొందవచ్చును.


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment