APPSDA Content Search

Our Software's
Schemes - Services
Simple Steps
Important Websites
Important Apps
Application Forms
Quick Links & Dash boards

SANCTION OF MOTORIZED THREE WHEELERS 2025 (మూడు చక్రాల మోటార్ వాహనాలు )

SANCTION OF MOTORIZED THREE WHEELERS 2025
SANCTION OF MOTORIZED THREE WHEELERS 2025 (మూడు చక్రాల మోటార్ వాహనాలు ) అనగా
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడాన మూడు చక్రాల మోటార్ వాహనాలు మంజూరు 2025 ను ప్రకటించినది.

  • .ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని లోకోమోటర్ దివ్యాంగులు (Orthopedically Handicapped) కలిగిన అర్హులైన వ్యక్తుల నుండి 100% సబ్సిడీతో రెట్రోఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనా (ముడుచక్రల మోటార్ వాహనాలు ) మంజూరు చేస్తారు.

  • ఈ పథకం G.O.Ms.No. 10, మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్దుల సంక్షేమ (Prog. II) శాఖ, తేదీ 22.03.2021 ప్రకారం అమలు చేయబడుతుంది. .

  • మూడు చక్రాల మోటార్ వాహనాల మంజూరు కొరకు ఈ క్రింద తెలిపిన అర్హతలు ఉంటే క్రింద తెలిపిన డాకుమెంట్స్ తో మీ ఇంటి వద్ద నుండే 25 నవంబర్ 2025 వ తారీఖు లోపు దరకాస్తు చేసుకోవచ్చు .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  1. 25.11.2025 నాటికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సుకలిగి ఉండాలి. .

  2. ఒకటి లేదా రెండు కింద భాగాలు (లోయర్ లింట్స్) ప్రభావితమై 70% లేదా అంతకంటే ఎక్కువ లోకోమోటర్ వికలాంగత (Orthopedically Handicapped) ఉండాలి.

  3. వార్షిక కుటుంబ ఆదాయం ₹3,00,000/- కంటే ఎక్కువ కాకూడదు.

  4. అభ్యర్థిఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుకావాలి.

  5. కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  6. అనుకూల వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

  7. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంతకుముందుఏ మోటరైజ్డ్ వాహనాన్ని పొందకూడదులేదా తన పేరుపై వాహనం ఉండకూడదు.

  8. ఈ ప్రయోజనం జీవితంలో ఒక్కసారి మాత్రమేపొందగలరు.

  9. సహాయ ఉపకరణములుతో నడవని వారు అర్హులు కారు.

  10. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న విద్యార్థులు అర్హులు.

  11. స్వయం ఉపాధి, వ్యవసాయం&అనుబంధ రంగాలు లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న జీతం/వేతనం ఉద్యోగులు (కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి).


దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  1. వికలాంగుల ధృవపత్రం (SADAREM / జిల్లా వైద్య బోర్డు)

  2. ఆధార్ కార్డు జెరాక్స్

  3. ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్

  4. కుల ధృవపత్రం (వర్తిస్తే)

  5. తాజా ఆదాయ ధృవపత్రం

  6. బోనాఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థుల కోసం) / ఉపాధి ధృవపత్రం (స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసం)

  7. పాస్పోర్ట్ సైజు ఫోటో

  8. వికలాంగుల కోసం ఉద్దేశించిన ఏదైనా ప్రయోజనాన్ని మోసపూరితంగా పొందినందుకు శిక్షపై స్వీయ ప్రకటన.

  9. ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ప్రకటన


ఎంపిక విధానం (Selection Process)
  1. అర్హులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు & వృద్ధులసహాయ సంస్థ (APDASCAC) అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తెది : 25-11-2025

  2. తదుపరి జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు పరిశీలించబడతాయి.

  3. ఈ కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు.

  4. వాహనాల మంజూరు బడ్జెట్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది.


దరకాస్తు విధానం (REGISTRATION PROCESS )
  1. మూడు చక్రాల మోటార్ వాహనాలు మంజూరు 2025 నమోదు కొరకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .

    TRI CYCLE మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
      అక్కడ మీ యొక్క
    • సదరం నెంబర్
    • పేరును ఎంటర్ చెయ్యండి.

  2. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • ఆధార్ నెంబర్
    • లింగం
    • వికలాంగుల రకం
    • వికలాంగత్వం శాతం
    • పుట్టిన తేది
    • తండ్రి పేరు
    • వివాహ స్థితి
    • కులం వివరాలు ఎంటర్ చెయ్యండి.

  3. TRI CYCLE

  4. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క శాశ్వత చిరునామా వివరాలైన
    • రాష్ట్రం పేరు
    • జిల్లా పేరు
    • నియోజక వర్గం పేరు
    • మండలం పేరు
    • గ్రామం/మునిసిపాలిటి పేరు
    • వార్డు నెంబర్
    • ఇంటి నెంబర్
    • పిన్ కోడ్
    • మొబైల్ నెంబర్
    • మెయిల్ ఐడి వివరాలు ఎంటర్ చెయ్యండి.

  5. TRI CYCLE

  6. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క ప్రస్తుత చిరునామా వివరాలైన
    • రాష్ట్రం పేరు
    • జిల్లా పేరు
    • నియోజక వర్గం పేరు
    • మండలం పేరు
    • గ్రామం/మునిసిపాలిటి పేరు
    • వార్డు నెంబర్
    • ఇంటి నెంబర్
    • పిన్ కోడ్
    • మొబైల్ నెంబర్
    • మెయిల్ ఐడి వివరాలు ఎంటర్ చెయ్యండి.

  7. TRI CYCLE

  8. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • కుటుంబ వార్షిక ఆదాయం
    • ఆదాయ దృవీకరణ పత్రం జారీ తెది
    • ఆదాయ వనరు
    • డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు సెలెక్ట్ చెయ్యండి.

  9. TRI CYCLE

  10. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • ప్రస్తుతం చదువుతున్నారా లేదా ?
    • పూర్తి చేసిన కోర్స్ పేరు
    • కాలేజీ/స్కూల్ పేరు
    • అడ్మిషన్ నెంబర్
    • కోర్స్ పేరు
    • కోర్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదివారు
    • కాలేజీ/స్కూల్ అడ్రస్
    • కాలేజీ/స్కూల్ ఫోన్ నెంబర్ వివరాలు ఎంటర్ చెయ్యండి.

  11. TRI CYCLE

  12. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • వికలాంగుల ధృవపత్రం (SADAREM / జిల్లా వైద్య బోర్డు)
    • ఆధార్ కార్డు జెరాక్స్
    • ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్
    • కుల ధృవపత్రం (వర్తిస్తే)
    • పాస్పోర్ట్ సైజు ఫోటో
    • తాజా ఆదాయ ధృవపత్రం డాకుమెంట్స్ అప్లోడ్ చెయ్యండి.

  13. TRI CYCLE

  14. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • బోనాఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థుల కోసం) / ఉపాధి ధృవపత్రం (స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసం)
    • వికలాంగుల కోసం ఉద్దేశించిన ఏదైనా ప్రయోజనాన్ని మోసపూరితంగా పొందినందుకు శిక్షపై స్వీయ ప్రకటన.
    • ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్
    • ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ప్రకటన డాకుమెంట్స్ అప్లోడ్ చెయ్యండి.

  15. TRI CYCLE

  16. తదుపరి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ అన్ని చెక్ బాక్స్ ల మీద టిక్ చేసి SUBMIT బటన్ మీద క్లిక్ చెయ్యండి.అంతే మీరు మూడు చక్రాల మోటార్ వాహనాలు మంజూరు 2025 కు దరకాస్తు చేసుకున్నట్లే.

  17. TRI CYCLE


స్వీయ ప్రకటన పత్రాన్ని ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

1.వికలాంగుల కోసం ఉద్దేశించిన ఏదైనా ప్రయోజనాన్ని మోసపూరితంగా పొందినందుకు శిక్షపై స్వీయ ప్రకటన డౌన్లోడ్ ↓

2.ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ప్రకటన డౌన్లోడ్ ↓


CONCLUSION (ముగింపు)
  1. దరకాస్తునకు చివరి తేది : 25-11-2025

  2. మహిళలకు రిజర్వేషన్ శాతం : 50

  3. వాహనం విలువ : 1.30 లక్షలు

  4. నియోజక వర్గానికి కేటాయించినవి : 10

  5. అభ్యర్ధికి అయ్యే ఖర్చు : పూర్తి ఉచితం

  6. దరకాస్తు చేసుకోనుడకు లింకు : ఇక్కడ క్లిక్ చెయ్యండి .


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment