Agricultural Income Certificate (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం) కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Agricultural Income Certificate
Agricultural Income Certificate (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం ) అనగా
  • ఈ సేవ నే Agricultural Income అని కూడా అంటారు .

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం పౌరుడికి అతని / ఆమె వార్షిక వ్యవసాయ ఆదాయాన్ని ధృవీకరించే అధికారిక ప్రకటన.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లో అన్ని రకాల వ్యవసాయ వనరుల నుండి ఒక వ్యక్తి / కుటుంబం యొక్క ఆదాయ వివరాలు ఉంటాయి .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • వ్యవసాయ ఆదాయం అనేది వ్యవసాయ భూమి, వ్యవసాయ భూమిపై లేదా వ్యవసాయ భూమితో అనుబంధించబడిన భవనాలు మరియు వ్యవసాయ భూమి నుండి ఉత్పత్తులను కలిగి ఉన్న మూలాల నుండి ఆర్జించే ఆదాయాన్ని సూచిస్తుంది.

  • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(1) వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించింది. అందువల్ల, పన్ను మినహాయింపు యొక్క ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండటం అవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందడం బ్యాంకు రుణం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా, వ్యవసాయ కార్యకలాపాల నుండి ఏవైనా నష్టాలను వచ్చే ఎనిమిది మదింపు సంవత్సరాల వ్యవసాయ ఆదాయంతో భర్తీ చేయవచ్చు.

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమైన పౌరుడు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం క్లెయిమ్ చేయబడిన ఆదాయం నిర్దేశిత వ్యవసాయ ఆదాయం కిందకు రావాలి.

  • వ్యవసాయ భూమి నుండి వచ్చే ఆదాయం భారతదేశంలో భూమి ఉన్నప్పుడే వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం జారీ కోసం లెక్కించబడుతుంది. హక్కుల రికార్డులో దరఖాస్తుదారు పేరుపై భూమి తప్పనిసరిగా ఉండాలి.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Agricultural Income (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

LATE REGISTRATION OF BIRTH /DEATH (లేట్ జనన మరియు మరణ దృవపత్రం) కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Schemes
ఆలస్యమైన మరణ దృవపత్రం ( LATE REGISTRATION OF DEATH ) అనగా
  • ఈ సేవ నే LATE REGISTRATION OF DEATH / BIRTH అని కూడా అంటారు .

  • LATE REGISTRATION OF DEATH సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంబంధిత జనన రిజిస్ట్రార్ దగ్గర గడువు కాలంలో (సుమారుగా 21 రోజులు ,ఫైన్ తో 30 రోజులు ) నమోదు చేసుకొని యెడల వారికి LATE REGISTRATION OF DEATH ద్వారా మరణ ద్రువీకరణ పత్రం మంజూరు చెయ్యవచ్చు.

  • ఈ మరణ ద్రువీకరణ పత్రం ఒక వ్యక్తి ఫలానా తేదీన ఫలానా కారణం చేత ఫలానా ప్రదేశం లో మరణించినారు అని రుజువు క్రింద ఉపయోగపడుతుంది .

  • ముఖ్యంగా ఆ చనిపోయిన వ్యక్తి మీద వున్న ఆస్తులు , బ్యాంకు లో డబ్బులు , ఇంకా ఇతర చనిపోయిన తరవాత వచ్చే భీమా లాభాలు తన వారసులు గాని సహా ధర్మచారిని / సహా ధర్మ చారి గాని పొందడానికి ఈ మరణ ద్రువీకరణ పత్రం ఎంత గానో ఉపయోగపడుతుంది .

ఎలా అప్లై చేసుకోవాలి ? ( How To Apply )
  • ముందుగా సంబంధిత గ్రామ పంచాయతి నుండి గాని ,మునిసిపల్ ఆఫీసు నుండి గాని Non availability certificate తెచ్చుకోవాలి .

  • తరువాత క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తీసుకొని LATE REGISTRATION OF DEATH కి మీ సచివాలయంలో దరకాస్తు చేసుకోవాలి .

  • తరువాత ఫీల్డ్ విచారణ జరిగిన తర్వాత మీకు సంబంధిత రెవిన్యూ డివిజనా్ అధికారి దగ్గర నుండి మీరు ఎక్కడితే దరకాస్తు చేసుకున్నారో అక్కడకి ప్రొసీడింగ్స్ కాపీ వస్తుంది .

  • ఆ తరువాత సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని మీ యొక్క సంబంధిత మరణ రిజిస్ట్రార్ గారిని కలిసిన యెడల మీకు మరణ ధ్రువ పత్రం మంజూరు చేస్తారు .

ఆలస్యమైన మరణ దృవపత్రం ( LATE REGISTRATION OF DEATH ) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • గ్రామ పంచాయతి / మునిసిపల్ కమీషనర్ జారీ చేసిన Non availability certificate *

  • ఆదార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ / SSC జెరాక్స్ / స్వీయ అఫిడవిట్ జెరాక్స్*

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

LATE REGISTRATION OF DEATH(ఆలస్యమైన మరణ దృవపత్రం కొరకు ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆలస్యమైన జనన దృవపత్రం ( LATE REGISTRATION OF BIRTH) అనగా
  • ఈ సేవ నే LATE REGISTRATION OF DEATH / BIRTH అని కూడా అంటారు .

  • LATE REGISTRATION OF BIRTH సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి పుట్టిన తర్వాత సంబంధిత జనన రిజిస్ట్రార్ దగ్గర గడువు కాలంలో (సుమారుగా 21 రోజులు ,ఫైన్ తో 30 రోజులు ) నమోదు చేసుకొని యెడల వారికి LATE REGISTRATION OF BIRTH ద్వారా జనన ద్రువీకరణ పత్రం మంజూరు చెయ్యవచ్చు.

  • ఈ జనన ద్రువీకరణ పత్రం ఒక వ్యక్తి ఫలానా తేదీన ఫలానా కారణం చేత ఫలానా ప్రదేశం లో జన్మించినారు అని రుజువు క్రింద ఉపయోగపడుతుంది .

  • ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి , ఉద్యోగ ప్రయత్నంలో వున్న వారికి , విద్యార్ధులకు ఈ జనన ద్రువీకరణ పత్రం ఎంత గానో ఉపయోగపడుతుంది .

ఎలా అప్లై చేసుకోవాలి ? ( How To Apply )
  • ముందుగా సంబంధిత గ్రామ పంచాయతి నుండి గాని ,మునిసిపల్ ఆఫీసు నుండి గాని Non availability certificate తెచ్చుకోవాలి .

  • తరువాత క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తీసుకొని LATE REGISTRATION OF BIRTH కి మీ సచివాలయంలో దరకాస్తు చేసుకోవాలి .

  • తరువాత ఫీల్డ్ విచారణ జరిగిన తర్వాత మీకు సంబంధిత రెవిన్యూ డివిజనా్ అధికారి దగ్గర నుండి మీరు ఎక్కడితే దరకాస్తు చేసుకున్నారో అక్కడకి ప్రొసీడింగ్స్ కాపీ వస్తుంది .

  • ఆ తరువాత సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని మీ యొక్క సంబంధిత జనన రిజిస్ట్రార్ గారిని కలిసిన యెడల మీకు జనన ధ్రువ పత్రం మంజూరు చేస్తారు .

ఆలస్యమైన జనన దృవపత్రం ( LATE REGISTRATION OF BIRTH) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • గ్రామ పంచాయతి / మునిసిపల్ కమీషనర్ జారీ చేసిన Non availability certificate *

  • రేషన్ కార్డు జెరాక్స్ / SSC జెరాక్స్ / స్వీయ అఫిడవిట్ జెరాక్స్*

  • ఆదార్ కార్డు జెరాక్స్*

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

LATE REGISTRATION OF BIRTH (ఆలస్యమైన జనన దృవపత్రం కొరకు ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

CPDCL New Electricity Connection -కొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకొనుటకి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , సర్వీస్ రకాలు ,అప్లికేషను ఫారం

Cpdcl New Electricity meter
కొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకొనుట - Application For New Electricity Connection అనగా
  • ఒక ఇంటికి కాని ,ఫ్యాక్టరీ గాని ఇంకా ఇతర ఎ అవసరాల కైనా విద్యుత్తు వినియోగించవలెనన్న ముందుగా కొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకోవలెను .

  • ముఖ్యంగా గృహ అవసరాలకు విద్యుత్తు వినియోగించవలెనన్న కరెంటు మీటర్ తప్పనిసరిగా ఉండవలెను.

  • గృహ అవసరాలకు కరెంటు మీటర్ లేకుండా విద్యుత్తు వినియోగించిన యెడల చట్టరీత్యా చర్యలు తీసుకోనబడును .

  • మన గ్రహ అవసరాన్ని బట్టి కిలో వాట్ట్స్ లో లోడ్ ను తీసుకోవాలి.

  • *ఈ కొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకోనునప్పుడు రెండు క్యాటగిరులు ఉంటాయి .

    1. LT Category

    400 వోల్టుల 3- phase కనెక్షన్ మరియు 230 వోల్టులు 1 - phase కనెక్షన్ (గృహ అవసరాలకు) సప్లై వున్న క్యాటగిరి ని LT Category అంటారు .

    2. HT Category

    11000 కిలో వోల్టులు అంత కంటే ఎక్కువ సప్లై అవసరమున్న భారీ విద్యుత్ కొనుగోలుదారులకు ఈ HT Category వర్తిస్తుంది.

1. LT Category సర్వీస్ రకాలు
  • LT1 - Domestic (గృహానికి )

  • LT2 - Commercial (వాణిజ్యపరమైన)

  • LT3 - Industrial( పారిశ్రామిక)

  • LT4 - Cottage/Agro Based Industries & Dhobigat (కుటీర/వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు & ధోబిగట్)

  • LT5 - Agricultural(వ్యవసాయం)

  • LT5C – Salt Farming/Rural Horticulture Nurseries up to 15HP(ఉప్పు వ్యవసాయం/గ్రామీణ హార్టికల్చర్ నర్సరీలు 15HP వరకు)

  • LT6A – Street Lights ( వీధి దీపాలు)

  • LT6B – Water Works ( వాటర్ వర్క్స్)

  • LT6C – NTR Sujala Padhakam( NTR సుజల పధకం)

  • LT7 – General Purpose/Religious Places(సాధారణ ప్రయోజనం/మతపరమైన స్థలాలు)

  • LT8 – Temporary Supply ( తాత్కాలిక సరఫరా)

1. HT Category సర్వీస్ రకాలు
  • HT1A – Industry General (ఇండస్ట్రీ జనరల్)

  • HT1B – Energize Incentive Industries (ప్రోత్సాహక పరిశ్రమలను శక్తివంతం చేయుట )

  • HT1C – Aquaculture & Animal Husbandry( ఆక్వాకల్చర్ & యానిమల్ హస్బెండరీ)

  • HT1D – Poultry Hatcheries & Poultry Feed Mixing Plants (పౌల్ట్రీ హేచరీస్ & పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్)

  • HT2 – Others (ఇతరులు)

  • HT3 – Public Infrastructure & Tourism (పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & టూరిజం)

  • HT4 – Govt., Lift Irrigation, Agriculture & CPWS (ప్రభుత్వం, లిఫ్ట్ ఇరిగేషన్, అగ్రికల్చర్ & CPWS)

  • HT5 – Railway Traction ( రైల్వే ట్రాక్షన్)

  • HT6 – Township & Residential Colonies ( టౌన్‌షిప్ & రెసిడెన్షియల్ కాలనీలు)

  • HT7 – Green Power ( గ్రీన్ పవర్)

  • HT8 – Temporary Supply ( తాత్కాలిక సరఫరా)

కొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకొనుట - Application For New Electricity Connection దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • పాస్పోర్ట్ సైజు ఫోటో (*

  • ఐ.డి ప్రూఫ్ (ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి చాలు )*
    • Aadhaar card copy (ఆధార్ కార్డ్ నకలు )
    • Driving License Copy (డ్రైవింగ్ లైసెన్స్ నకలు )
    • Electoral copy (ఎలక్టోరల్ నకలు )
    • Pan Card copy(పాన్ కార్డ్ నకలు )
    • Ration card copy (రేషన్ కార్డ్ నకలు )
  • ప్రూఫ్ డాక్యుమెంట్ *(ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి చాలు )
    • Affidavit (అఫిడవిట్)
    • Assignment Patta (అసైన్‌మెంట్ పట్టా )
    • Death Certificate copy (మరణ ధృవీకరణ పత్రం నకలు )
    • DKT Patta copy(DKT పట్టా )
    • House Tax Receipt (ఇంటి పన్ను రసీదు )
    • Indemnity Bond Copy (నష్టపరిహారం బాండ్ కాపీ )
    • LT Agreement (LT ఒప్పందం)
    • No Objection Letter ( అభ్యంతరం లేని లేఖ )
    • Owner ship certificate (ఓనర్ షిప్ సర్టిఫికేట్ )
    • Previous Electricity Bill(మునుపటి విద్యుత్ బిల్లు )
    • Proceedings (ప్రొసీడింగ్స్ )
    • Sale Deed Copy (సేల్ డీడ్ కాపీ )
    • Secretary Letter (సెక్రటరీ లెటర్ )
  • Municipality/Gram panchayat Permission Letter (మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ అనుమతి లేఖ) *

  • Caste Certificate (Mandatory if SC/ST) కుల ధృవీకరణ పత్రం (SC/ST అయితే తప్పనిసరి)

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి ,

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Application For New Electricity Connection - కొత్త కరెంటు మీటర్ కొరకు అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Sadarem Certificate - సదరం సర్టిఫికేట్ కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Sadarem
సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate అనగా
  • దివ్యాంగుల సంక్షేమం మరియు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కోసం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు. .

  • దివ్యాంగులకు ఈ సదరం సర్టిఫికేట్ ఆధారంగా అనేక సంక్షేమ పథకాలకు వెసులుబాటు కలుగుతుంది.

  • *ఈ సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate ద్వారా మూడు చక్రాల బండిలో తిరిగే వికలంగులు , చెవిటి వారు , మూగ వారు , మానసిక వికలాంగులు ఈ సదరం సెర్ఫిఫికట్ లో 40 శాతం అంతకంటే ఎక్కువ ఉన్నయెడల అని రకాల సంక్షేమ పధకాలు ఉదా : వై ఎస్ ఆర్ పెన్షన్ కానుక వంటివి పొందవచ్చు .

సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate పొందే విధానం
  • ముందుగా సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate కొరకు దరకాస్తు చేసుకొనే వ్యక్తి మూడు చక్రాల బండిలో తిరిగే వికలంగులు , చెవిటి వారు , మూగ వారు , మానసిక వికలాంగులు అయ్యి వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకొని వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన యొక్క రెండు పుట్టు మచ్చలు వుండే ప్రదేశం తెలుసుకొని వుండాలి .

  • ప్రభుత్వం వారు సదరం స్లోట్లు వదిలిన వెంటనే మీ సచివాలయం లో కలసి స్లాట్ బుక్ చేయించుకోవాలి .

  • దరకాస్తు దారుడు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు ,

  • దరకాస్తు దారుడు అపాయింట్మెంట్ ఇచ్చిన సమయాని సదరు ఆసుపత్రికి వెళ్ళిన యెడల మిమ్మల్ని పరిశీలించి ,దరకాస్తు దారుడు అర్హుడైతే సదరం సర్టిఫికేట్ మంజూరు చేస్తారు .

  • దరకాస్తు దారుడు ఎక్కడైతే సదరం స్లాట్ బుక్ చేసుకున్నాడో అక్కడే అతని / ఆమె సదరం సర్టిఫికేట్ పొందవచ్చు .

సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • ఆధార్ కార్డు జెరాక్స్ (Aadhar card Xerox)*

  • ఆధార్ కార్డు లింక్ ఐన మొబైల్ ఫోన్ మరియు మొబైల్ నెంబర్ *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

సదరం సర్టిఫికేట్ - Sadarem అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

CPDCL CONSUMER COMPLAINTS - CPDCL వినియోగదారుల ఫిర్యాదుల కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , సర్వీస్ రకాలు ,అప్లికేషను ఫారం

CPDCL CONSUMER COMPLAINTS
CPDCL CONSUMER COMPLAINTS - CPDCL వినియోగదారుల ఫిర్యాదులుకి దరకాస్తు చేసుకొనుట మరియు రకాలు
  • Address Correction (అడ్రస్ కరెక్షన్ )

  • Category Change (కేటగిరీ చేంజ్ )

  • Dismantlement (డిమాంటిల్‌మెంట్)

  • Electrification of Colony (కాలనీ విద్యుద్దీకరణ )

  • Electrification of Layout (లేఅవుట్ విద్యుద్దీకరణ )

  • HT Additional Load (HT అదనపు లోడ్ )

  • HT Title Transfer ( HT టైటిల్ బదిలీ )

  • HT-LT Conversion (HT-LT కన్వర్షన్ )

  • Line Shifting / DTR Shifting ( లైన్ షిఫ్టింగ్ / DTR షిఫ్టింగ్ )

  • Load Deration (లోడ్ డెరేషన్)

  • LT Additional Load (LT అడిషనల్ లోడ్ )

  • LT Title Transfer (LT టైటిల్ ట్రాన్స్‌ఫర్)

  • LT-HT Conversion (LT-HT కన్వర్షన్ )

  • Meter Burnt/Glass Broken (మీటర్ బర్న్ట్/గ్లాస్ బ్రోకెన్ )

  • Meter Testing (మీటర్ టెస్టింగ్)

  • Other Capital Works (ఇతర క్యాపిటల్ వర్క్స్ )

  • Net Metering (నికర మీటరింగ్ )

  • Phase Conversion (ఫేజ్ కన్వర్షన్ )

  • SC/ST Certification (SC/ST సర్టిఫికేషన్ )

  • Shifting of Service (సేవ యొక్క బదిలీ )

  • Temporary Connection (up to 10 days) (సర్వీస్ తాత్కాలిక కనెక్షన్ యొక్క మార్పు (10 రోజుల వరకు) )

  • Wrong Billing ( తప్పు బిల్లింగ్)

  • Note ( గమనిక ) : CPDCL వినియోగదారుల ఫిర్యాదులుకి దరకాస్తు చేసుకొనుట కొరుకు అవసరమైన పత్రాల కోసం క్రిందకు వెళ్ళండి .

  • మన గృహ/ ఇతర ఎ విద్యుత్తు అవసరాన్ని బట్టి కిలో వాట్ట్స్ లో లోడ్ ను తీసుకోవాలి.

  • *ఈ కొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకోనునప్పుడు రెండు క్యాటగిరులు ఉంటాయి .

    1. LT Category

    400 వోల్టుల 3- phase కనెక్షన్ మరియు 230 వోల్టులు 1 - phase కనెక్షన్ (గృహ అవసరాలకు) సప్లై వున్న క్యాటగిరి ని LT Category అంటారు .

    2. HT Category

    11000 కిలో వోల్టులు అంత కంటే ఎక్కువ సప్లై అవసరమున్న భారీ విద్యుత్ కొనుగోలుదారులకు ఈ HT Category వర్తిస్తుంది.

1. LT Category సర్వీస్ రకాలు
  • LT1 - Domestic (గృహానికి )

  • LT2 - Commercial (వాణిజ్యపరమైన)

  • LT3 - Industrial( పారిశ్రామిక)

  • LT4 - Cottage/Agro Based Industries & Dhobigat (కుటీర/వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు & ధోబిగట్)

  • LT5 - Agricultural(వ్యవసాయం)

  • LT5C – Salt Farming/Rural Horticulture Nurseries up to 15HP(ఉప్పు వ్యవసాయం/గ్రామీణ హార్టికల్చర్ నర్సరీలు 15HP వరకు)

  • LT6A – Street Lights ( వీధి దీపాలు)

  • LT6A – Street Lights ( వీధి దీపాలు)

  • LT6B – Water Works ( వాటర్ వర్క్స్)

  • LT6C – NTR Sujala Padhakam( NTR సుజల పధకం)

  • LT7 – General Purpose/Religious Places(సాధారణ ప్రయోజనం/మతపరమైన స్థలాలు)

  • LT8 – Temporary Supply ( తాత్కాలిక సరఫరా)

1. HT Category సర్వీస్ రకాలు
  • HT1A – Industry General (ఇండస్ట్రీ జనరల్)

  • HT1B – Energize Incentive Industries (ప్రోత్సాహక పరిశ్రమలను శక్తివంతం చేయుట )

  • HT1C – Aquaculture & Animal Husbandry( పారిశ్రామిక)

  • HT1D – Poultry Hatcheries & Poultry Feed Mixing Plants (పౌల్ట్రీ హేచరీస్ & పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్)

  • HT2 – Others (ఇతరులు)

  • HT3 – Public Infrastructure & Tourism (పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & టూరిజం)

  • HT4 – Govt., Lift Irrigation, Agriculture & CPWS (ప్రభుత్వం, లిఫ్ట్ ఇరిగేషన్, అగ్రికల్చర్ & CPWS)

  • HT5 – Railway Traction ( రైల్వే ట్రాక్షన్)

  • HT6 – Township & Residential Colonies ( టౌన్‌షిప్ & రెసిడెన్షియల్ కాలనీలు)

  • HT7 – Green Power ( గ్రీన్ పవర్)

  • HT8 – Temporary Supply ( తాత్కాలిక సరఫరా)

CPDCL CONSUMER COMPLAINTS - CPDCL వినియోగదారుల ఫిర్యాదులుకి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • ఎలక్ట్రిసిటీ బిల్లు *

  • ఐ.డి ప్రూఫ్ (ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి చాలు )*

    • Aadhaar card copy (ఆధార్ కార్డ్ నకలు )
    • Driving License Copy (డ్రైవింగ్ లైసెన్స్ నకలు )
    • Electoral copy (ఎలక్టోరల్ నకలు )
    • Pan Card copy(పాన్ కార్డ్ నకలు )
    • Ration card copy (రేషన్ కార్డ్ నకలు )
  • ప్రూఫ్ డాక్యుమెంట్ *(ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి చాలు )

    • Affidavit (అఫిడవిట్)
    • Assignment Patta (అసైన్‌మెంట్ పట్టా )
    • Death Certificate copy (మరణ ధృవీకరణ పత్రం నకలు )
    • DKT Patta copy(DKT పట్టా )
    • House Tax Receipt (ఇంటి పన్ను రసీదు )
    • Indemnity Bond Copy (నష్టపరిహారం బాండ్ కాపీ )
    • LT Agreement (LT ఒప్పందం)
    • No Objection Letter ( అభ్యంతరం లేని లేఖ )
    • Owner ship certificate (ఓనర్ షిప్ సర్టిఫికేట్ )
    • Previous Electricity Bill(మునుపటి విద్యుత్ బిల్లు )
    • Proceedings (ప్రొసీడింగ్స్ )
    • Sale Deed Copy (సేల్ డీడ్ కాపీ )
    • Secretary Letter (సెక్రటరీ లెటర్ )
  • Municipality/Gram panchayat Permission Letter (మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ అనుమతి లేఖ) *

  • Caste Certificate (Mandatory if SC/ST) కుల ధృవీకరణ పత్రం (SC/ST అయితే తప్పనిసరి)

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి ,

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

CPDCL CONSUMER COMPLAINTS - CPDCL వినియోగదారుల ఫిర్యాదుల అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

E- Pass Book Application ( పట్టాదారు పాస్ పుస్తకం ) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

E-Pass Book Application
కొత్త పట్టాదారు పాస్ పుస్తకం / డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం / పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement) (E-Pass Book Application ) అనగా
  • ఈ సేవ నే E-Pass Book Application అని కూడా అంటారు .

  • E-Pass Book Application సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • E-Pass Book Application ముఖ్యంగా మనం మూడు రకాలుగా దారకాస్తు చేసుకోవచ్చు.

    1. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం :

    * ఒకరి భూమి ఇంకొకరి మీదకు మారినప్పుడు (కొనుగోలు ద్వారా గాని , వారసత్వంగా గాని , ఇంకా ఎ విధంగా ఐన ) మొట్ట మొదటి సారిగా పట్టాదారు పాస్ పుస్తకం ఈ సేవ ద్వారా పొందవచ్చు.

    2. డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం

    * ఒక వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుంది ఆ పాసు పుస్తకం నకలు కావాలి అంటే ఈ సేవ ద్వారా పొందవచ్చు .

    3. పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement)

    * ఒక వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుండి ఆ పట్టా దారు పాసు పుస్తకం చిరిగి పోయిన యెడల ,చిరిగోపోయిన పాసుపుస్తకం సరెండర్ చేసి కొత్త పాసు పుస్తకం కావాలి అంటే ఈ సేవ ద్వారా పొందవచ్చు .

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • E-Pass Book Application దరకాస్తు కొరకు ఆ రైతు యొక్క పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ ) లో వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి మాత్రమే దరకాస్తు చేసుకోగలరు .

1. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • టాక్స్ రిసిప్ట్స్ ఎవినా వుంటే *

  • పాత పట్టాదారు పాస్ బుక్ టైటిల్ డీడ్ జెరాక్స్*

  • దస్తావేజు నకలు*

  • పట్టాదారుని ఇటీవలి ఫోటో *

  • పట్టాదారుని సంతకం *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

2. డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఎఫ్ ఐ ఆర్ స్కాన్ నకలు *

  • మీ పరిధిలోని బ్యాంకు నుండి NOC *

  • దస్తావేజు నకలు*

  • పట్టాదారుని ఇటీవలి ఫోటో *

  • పట్టాదారుని సంతకం *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

3. పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దస్తావేజు నకలు*

  • పట్టాదారుని ఇటీవలి ఫోటో *

  • పట్టాదారుని సంతకం *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

పొలం పట్టాదారు పాస్ పుస్తకం ( E-Pass Book Application ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

Printing of Title Deed Cum PPB (టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ) కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Printing of Title Deed Cum PPB
టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ(Printing of Title Deed Cum PPB ) అనగా
  • ఈ సేవ నే Printing of Title Deed Cum PPB అని కూడా అంటారు .

  • Printing of Title Deed Cum PPB సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • * ఒకరి భూమి ఇంకొకరి మీదకు మారినప్పుడు (కొనుగోలు ద్వారా గాని , వారసత్వంగా గాని , ఇంకా ఎ విధంగా ఐన ) మొట్ట మొదటి సారిగా పట్టాదారు పాస్ పుస్తకం రావాడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపు హై సెక్యూరిటీ మీద పాస్ బుక్ ని ఈ Printing of Title Deed Cum PPB సేవ ద్వారా పొందవచ్చు.

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ (Printing of Title Deed Cum PPB ) దరకాస్తు కొరకు ఆ రైతు యొక్క పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ ) లో వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి మాత్రమే దరకాస్తు చేసుకోగలరు .

టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • ఆధార్ కార్డు జెరాక్స్ (Aadhar card Xerox)*

  • పొలం ఖాతా నెంబర్ *

  • దరకాస్తు దారుడు (పొలం యొక్క యజమాని ) తన యొక్క బయోమెట్రిక్ ద్వారా గాని , ఐరిష్ ద్వారా గాని నిర్ధారించుకోవలసి వస్తుంది *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ (Printing of Title Deed Cum PPB ) సేవను పొందుడకు ఎటువంటి అప్లికేషను అవసరం లేదు

. మీ సచివాలయంలోని పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులను / WEDPS ను కలిసిన యెడల మీరు 15 నిముషాలలో ఈ సేవను పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail