Printing of Title Deed Cum PPB
టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ(Printing of Title Deed Cum PPB ) అనగా
ఈ సేవ నే Printing of Title Deed Cum PPB అని కూడా అంటారు .
Printing of Title Deed Cum PPB సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .
* ఒకరి భూమి ఇంకొకరి మీదకు మారినప్పుడు (కొనుగోలు ద్వారా గాని , వారసత్వంగా గాని , ఇంకా ఎ విధంగా ఐన ) మొట్ట మొదటి సారిగా పట్టాదారు పాస్ పుస్తకం రావాడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపు హై సెక్యూరిటీ మీద పాస్ బుక్ ని ఈ Printing of Title Deed Cum PPB సేవ ద్వారా పొందవచ్చు.
అర్హత ప్రమాణం (Eligibility Criteria)
టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ (Printing of Title Deed Cum PPB ) దరకాస్తు కొరకు ఆ రైతు యొక్క పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ ) లో వుండాలి .
దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి మాత్రమే దరకాస్తు చేసుకోగలరు .
టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
ఆధార్ కార్డు జెరాక్స్ (Aadhar card Xerox)*
పొలం ఖాతా నెంబర్ *
దరకాస్తు దారుడు (పొలం యొక్క యజమాని ) తన యొక్క బయోమెట్రిక్ ద్వారా గాని , ఐరిష్ ద్వారా గాని నిర్ధారించుకోవలసి వస్తుంది *
గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి
అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి
టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ (Printing of Title Deed Cum PPB ) సేవను పొందుడకు ఎటువంటి అప్లికేషను అవసరం లేదు . మీ సచివాలయంలోని పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులను / WEDPS ను కలిసిన యెడల మీరు 15 నిముషాలలో ఈ సేవను పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
No comments:
Post a Comment