E W S Certificate (ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ ) పొందడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

E W S Certificate
ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ (E W S Certificate) అనగా
  • ఈ సేవ నే “ISSUANCE OF INCOME & ASSET CERTIFICATE FOR ECONOMICALLY WEAKER SECTIONS (EWS) అని కూడా అంటారు .

  • ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • అగ్రవర్ణాల్లోని రిజర్వేషన్ వర్తించని సామాజిక వర్గాలకు చెందిన పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ ఉంటుంది.

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • ప్రస్తుత్తం అన్నిరకాల ఎంట్రెన్స్ టెస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • అగ్రవర్ణాలకు చెందిన పేదలకి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు లోపు ఉండాలి .

  • అగ్రవర్ణాలకు చెందిన పేదలకి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కుటుంబానికి 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు .

  • అగ్రవర్ణాలకు చెందిన పేదలకి పట్టణాల్లో 100 చదరపు గజాలు కంటే ఎక్కువ ఇంటిస్థలం ఉండకూడదు .

  • అగ్రవర్ణాలకు చెందిన పేదలకి ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాల కంటే ఎక్కువ ఇంటిస్థలం ఉండకూడదు .

  • అగ్రవర్ణాలకు చెందిన పేదలకి గ్రామాల్లో అయితే వెయ్యి గజాల కంటే ఎక్కువ ఇంటిస్థలం ఉండకూడదు .

  • గమనిక : కుటుంబం అనగా ఎవ్వరైతే దరకాస్తుదారుడు రిజర్వేషన్ పొందాలి అనుకుంటున్నారో ,అతని / ఆమె యొక్క తల్లి తండ్రులు , 18 సంవత్సరాల కంటే తక్కువ వున్న తోడ పుట్టిన వారు మరియు అతని / ఆమె భార్య /భర్త మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వున్న పిల్లలు.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form) .

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్

  • లాయర్ అఫిడవిట్ (పైన తెలిపిన అర్హత ప్రమాణం మొత్తం నమోదు చేసి వుండాలి.)

  • దరకాస్తుదారుని ఫోటో .


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ (E W S Certificate) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...