LATE REGISTRATION OF BIRTH /DEATH (లేట్ జనన మరియు మరణ దృవపత్రం) కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Schemes
ఆలస్యమైన మరణ దృవపత్రం ( LATE REGISTRATION OF DEATH ) అనగా
  • ఈ సేవ నే LATE REGISTRATION OF DEATH / BIRTH అని కూడా అంటారు .

  • LATE REGISTRATION OF DEATH సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంబంధిత జనన రిజిస్ట్రార్ దగ్గర గడువు కాలంలో (సుమారుగా 21 రోజులు ,ఫైన్ తో 30 రోజులు ) నమోదు చేసుకొని యెడల వారికి LATE REGISTRATION OF DEATH ద్వారా మరణ ద్రువీకరణ పత్రం మంజూరు చెయ్యవచ్చు.

  • ఈ మరణ ద్రువీకరణ పత్రం ఒక వ్యక్తి ఫలానా తేదీన ఫలానా కారణం చేత ఫలానా ప్రదేశం లో మరణించినారు అని రుజువు క్రింద ఉపయోగపడుతుంది .

  • ముఖ్యంగా ఆ చనిపోయిన వ్యక్తి మీద వున్న ఆస్తులు , బ్యాంకు లో డబ్బులు , ఇంకా ఇతర చనిపోయిన తరవాత వచ్చే భీమా లాభాలు తన వారసులు గాని సహా ధర్మచారిని / సహా ధర్మ చారి గాని పొందడానికి ఈ మరణ ద్రువీకరణ పత్రం ఎంత గానో ఉపయోగపడుతుంది .


ఎలా అప్లై చేసుకోవాలి ? ( How To Apply )
  • ముందుగా సంబంధిత గ్రామ పంచాయతి నుండి గాని ,మునిసిపల్ ఆఫీసు నుండి గాని Non availability certificate తెచ్చుకోవాలి .

  • తరువాత క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తీసుకొని LATE REGISTRATION OF DEATH కి మీ సచివాలయంలో దరకాస్తు చేసుకోవాలి .

  • తరువాత ఫీల్డ్ విచారణ జరిగిన తర్వాత మీకు సంబంధిత రెవిన్యూ డివిజనా్ అధికారి దగ్గర నుండి మీరు ఎక్కడితే దరకాస్తు చేసుకున్నారో అక్కడకి ప్రొసీడింగ్స్ కాపీ వస్తుంది .

  • ఆ తరువాత సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని మీ యొక్క సంబంధిత మరణ రిజిస్ట్రార్ గారిని కలిసిన యెడల మీకు మరణ ధ్రువ పత్రం మంజూరు చేస్తారు .


ఆలస్యమైన మరణ దృవపత్రం ( LATE REGISTRATION OF DEATH ) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • గ్రామ పంచాయతి / మునిసిపల్ కమీషనర్ జారీ చేసిన Non availability certificate *

  • ఆదార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ / SSC జెరాక్స్ / స్వీయ అఫిడవిట్ జెరాక్స్*


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

LATE REGISTRATION OF DEATH(ఆలస్యమైన మరణ దృవపత్రం కొరకు ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


ఆలస్యమైన జనన దృవపత్రం ( LATE REGISTRATION OF BIRTH) అనగా
  • ఈ సేవ నే LATE REGISTRATION OF DEATH / BIRTH అని కూడా అంటారు .

  • LATE REGISTRATION OF BIRTH సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి పుట్టిన తర్వాత సంబంధిత జనన రిజిస్ట్రార్ దగ్గర గడువు కాలంలో (సుమారుగా 21 రోజులు ,ఫైన్ తో 30 రోజులు ) నమోదు చేసుకొని యెడల వారికి LATE REGISTRATION OF BIRTH ద్వారా జనన ద్రువీకరణ పత్రం మంజూరు చెయ్యవచ్చు.

  • ఈ జనన ద్రువీకరణ పత్రం ఒక వ్యక్తి ఫలానా తేదీన ఫలానా కారణం చేత ఫలానా ప్రదేశం లో జన్మించినారు అని రుజువు క్రింద ఉపయోగపడుతుంది .

  • ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి , ఉద్యోగ ప్రయత్నంలో వున్న వారికి , విద్యార్ధులకు ఈ జనన ద్రువీకరణ పత్రం ఎంత గానో ఉపయోగపడుతుంది .


ఎలా అప్లై చేసుకోవాలి ? ( How To Apply )
  • ముందుగా సంబంధిత గ్రామ పంచాయతి నుండి గాని ,మునిసిపల్ ఆఫీసు నుండి గాని Non availability certificate తెచ్చుకోవాలి .

  • తరువాత క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తీసుకొని LATE REGISTRATION OF BIRTH కి మీ సచివాలయంలో దరకాస్తు చేసుకోవాలి .

  • తరువాత ఫీల్డ్ విచారణ జరిగిన తర్వాత మీకు సంబంధిత రెవిన్యూ డివిజనా్ అధికారి దగ్గర నుండి మీరు ఎక్కడితే దరకాస్తు చేసుకున్నారో అక్కడకి ప్రొసీడింగ్స్ కాపీ వస్తుంది .

  • ఆ తరువాత సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని మీ యొక్క సంబంధిత జనన రిజిస్ట్రార్ గారిని కలిసిన యెడల మీకు జనన ధ్రువ పత్రం మంజూరు చేస్తారు .


ఆలస్యమైన జనన దృవపత్రం ( LATE REGISTRATION OF BIRTH) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • గ్రామ పంచాయతి / మునిసిపల్ కమీషనర్ జారీ చేసిన Non availability certificate *

  • రేషన్ కార్డు జెరాక్స్ / SSC జెరాక్స్ / స్వీయ అఫిడవిట్ జెరాక్స్*

  • ఆదార్ కార్డు జెరాక్స్*

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

LATE REGISTRATION OF BIRTH (ఆలస్యమైన జనన దృవపత్రం కొరకు ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...