Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అర్హత ప్రమాణం (Eligibility Criteria),కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Labour Certificate
Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అనగా
  • ఈ సేవ నే Application For Integrated Registration Of Establishment Under Labour Laws (SECOND SCHEDULE [Sec.2(d) and Sec4(1)])- FORM A అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తి ఆంద్ర ప్రదేశ్ లో ఏదైనా షాపు నిర్వహిస్తున్న యెడల మరియు అందులో ఎవ్వరికైనా పని ఇచ్చిన యెడల ఆ షాపు అధికారికంగా ( AP Shops and ESTTS, Act 1988 ) ఈ లేబర్ సర్టిఫికేట్ ద్వారా నిర్వహించవచ్చును.

  • ఈ లేబర్ సర్టిఫికేట్ రక రకాల పనులు నిర్వహిస్తున్న వారు తీసుకోవచ్చును.ఉదాహరణకు ఎవ్వరైనా టైలర్ షాపు గాని , లాండ్రీ షాపు గాని , బార్బర్ షాపు గాని ,పిండి మిల్లు గాని , హాస్పిటల్ గాని ,నర్సింగ్ హోం గాని , కిరాణా షాపు గాని ఇంకా ఏ ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న గాని ఈ లేబర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చును.

  • స్థానిక పౌరులు మరియు నివాసితుల ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడానికి లేబర్ లైసెన్స్‌లను ఉపయోగించవచ్చు. విదేశీ కార్మికులు స్థానిక శ్రామిక శక్తిని స్థానభ్రంశం చేయకుండా లేదా తగ్గించకుండా చూసుకోవచ్చు.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం సేవ లేబర్ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లైసెన్స్ హోల్డర్‌కు దేశంలో ఉద్యోగం చేయడానికి చట్టపరమైన అనుమతిని మంజూరు చేస్తుంది. వారు స్థానిక కార్మిక చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని నిర్ధారిస్తుంది.

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఒక వ్యక్తి తప్పనిసరిగా ఏదో ఒక వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తూ వుండాలి..

  • నిర్వహిస్తున్న వ్యాపారం ఇండస్ట్రీ పరిధిలోకి రాకూడదు.

  • లేబర్ సర్టిఫికేట్ ను పునరిద్హరించుకోవడానికి పాత సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • యజమాని ఫోటో మరియు సంతకం *

  • యజమాని ఆధార్ కార్దు నకలు *

  • యజమాని ఇచ్చిన ధృవీకరణ లెటర్ లేదా స్వీయ ధృవీకరణ *

  • షాపు స్థాపన చిరునామా కాపీ *


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...