Our Softwares
Schemes - Services - Details
Application Forms
Important Websites
Important Apps
Dashboards & Status Check
Showing posts with label services - details. Show all posts
Showing posts with label services - details. Show all posts

HOUSE TAX PAYMENT & DOWNLOADING OF RECEIPT (PANCHAYAT) THROUGH SWARNA PANCHAYAT PORTAL IN ANDHRA PRADESH

HOUSE TAX PAYMENT THROUGH SWARNA PANCHAYAT PORTAL

HOUSE TAX PAYMENT (PANCHAYAT) THROUGH SWARNA PANCHAYAT PORTAL IN ANDHRA PRADESH

  1. SWARNA PANCHAYAT PORTAL ద్వారా నేరుగా హౌస్ టాక్స్ చెల్లించుటకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి . తదుపరి మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.

  2. swarnapanchayat HOUSE TAX PAYMENT

  3. తదుపరి మీ యొక్క జిల్లా ,మండలము ,పంచాయితి మరియు గ్రామము ను సెలెక్ట్ చెయ్యండి. తదుపరి మీరు మీ యొక్క హౌస్ టాక్స్ చెల్లించుటకు 4 విధాలుగా వెతకవచ్చు.
    1. Assessment Number
    2. Owner Name
    3. Door No
    4. Old Assessment Number
    మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.

  4. swarnapanchayat HOUSE TAX PAYMENT

  5. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది. తదుపరి మీరు మీ యొక్క Assessment Number,Owner Name, Door No, Old Assessment Number మరియు మొబైల్ నెంబర్ సరిచూసుకొని View Due & Pay బటన్ మీద క్లిక్ చెయ్యండి.

  6. swarnapanchayat HOUSE TAX PAYMENT

  7. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీరు ప్రస్తుతం చెల్లించవలసిన ఇంటి పన్ను మరియు గత బకాయి వివరాలు కనపడతాయి. మీరు చెల్లించ వలసిన ఇంటి పన్ను ఎదురుగా చెక్ బాక్స్ tick చేసి మరియు మొబైల్ నెంబర్ సరిచూసుకొని PROCEED TO PAY బటన్ మీద క్లిక్ చెయ్యండి.

  8. swarnapanchayat HOUSE TAX PAYMENT

  9. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు ఈ క్రింది విధంగా రకరకాల ఆన్లైన్ పేమెంట్ విధానాలు కనిపిస్తాయి.
    1. SBI NET BANKING
    2. SBI BANK DEBIT CARDS
    3. UPI
    4. OTHER BANK NET BANKING
    5. OTHER BANK DEBIT CARDS
    6. CREDIT CARDS
    మీరు పైన చూపిన విధానాలలో ఏదో ఒక విధానంలో పేమెంట్ చెయ్యవచ్చును.

  10. swarnapanchayat HOUSE TAX PAYMENT

  11. అంతే మీరు స్వయంగా SWARANA PANCHAYAT PORTAL ద్వారా మీ యొక్క ఇంటిపన్ను చెల్లించడం పూర్తి ఐనది.తదుపరి మీకు ఈ క్రింద చూపిన విధంగా మీ యొక్క ఇంటిపన్ను రసీదు డౌన్లోడ్ అవుతుంది.ఒక వేల మీకు ఇంటి పన్ను రసీదు డౌన్లోడ్ కాకపోయినా లేదా మరలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా క్రిందకు స్క్రోల్ చెయ్యండి.

  12. swarnapanchayat HOUSE TAX PAYMENT

  13. SWARNA PANCHAYAT PORTAL ద్వారా నేరుగా హౌస్ టాక్స్ చెల్లించిన రసీదు పొందుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి . తదుపరి మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.

  14. swarnapanchayat HOUSE TAX PAYMENT

  15. తదుపరి మీ యొక్క జిల్లా ,మండలము ,పంచాయితి మరియు గ్రామము ను సెలెక్ట్ చెయ్యండి. తదుపరి మీరు మీ యొక్క హౌస్ టాక్స్ చెల్లించుటకు 4 విధాలుగా వెతకవచ్చు.
    1. Assessment Number
    2. Owner Name
    3. Door No
    4. Old Assessment Number
    మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.తదుపరి SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.

  16. swarnapanchayat HOUSE TAX PAYMENT

  17. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది. తదుపరి మీరు మీ యొక్క Assessment Number,Owner Name, Door No, Old Assessment Number మరియు మొబైల్ నెంబర్ సరిచూసుకొని Property View బటన్ మీద క్లిక్ చెయ్యండి.

  18. swarnapanchayat HOUSE TAX PAYMENT

  19. తదుపరి మీ యొక్క స్క్రీన్ ను బాగా క్రిందకు స్క్రోల్ చేసిన యెడల మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది. తదుపరి మీరు రెడ్ మార్క్ చేసిన బటన్స్ మీద చేసిన యెడల మీ యొక్క ఇంటి పన్ను రసీదును (TELUGU / ENGLISH ) డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చును.

  20. swarnapanchayat HOUSE TAX PAYMENT

  21. తెలుగు ఇంటి పన్ను రసీదు

  22. swarnapanchayat HOUSE TAX PAYMENT

Rice card/Ration Card Status Checking Process in Andhra Pradesh

RICE CARD STATUS CHECKING

ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డు చెక్ చేసుకోను విధానము.LET'S Start !

NTR Bharosa pension scheme (ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం) కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

NTR Bharosa pension scheme
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ( NTR Bharosa pension scheme ) అనగా
  • ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలందరికీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం Ministry of Rural development డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సమాజంలోని అత్యంత హాని కలిగించే వర్గాలను రక్షించడానికి ప్రతి నెల వారికి ఆర్ధిక చేయూత ను అందించడం ద్వారా లభ్దిదారులకు ఎంత గానో ఉపయోగ పడుతుంది .

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లో భాగంగా పెన్షన్ రకాన్ని బట్టి ప్రస్తుతానికి 4000రూపాయల నుండి 15000 రూపాయల వరకు పెన్షన్‌ దారులకి వాలంటీర్స్ ద్వారా వారి ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నది.

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న 14 పెన్షన్ రకాలు .

    1. వృద్ధాప్య పెన్షన్ ( old Age Pension) - నెలకి 4000 రూపాయలు

    2. వితంతువు పెన్షన్ (Widow Pension)- నెలకి 4000 రూపాయలు

    3. కల్లు/గీత కార్మికుల పెన్షన్ ( Toddy Tappers Pension)- నెలకి 4000 రూపాయలు

    4. నేత కార్మికులు పెన్షన్ ( Weavers Pension) - నెలకి 4000 రూపాయలు

    5. ఒంటరి మహిళ పెన్షన్ ( Single women Pension) - నెలకి 4000 రూపాయలు

    6. మత్స్యకారుల పెన్షన్ ( Fishermen Pension) - నెలకి 4000 రూపాయలు

    7. యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్ పెన్షన్ ( ART (PLHIV) Pension)- నెలకి 4000 రూపాయలు

    8. సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ ( Traditional Cobblers Pension) - నెలకి 4000 రూపాయలు

    9. వికలాంగుల పెన్షన్ ( Disabled persons Pension) - నెలకి 6000 రూపాయలు లేదా నెలకి 15000 రూపాయలు

    10. ట్రాన్స్ జెండర్ పెన్షన్ ( Transgender Pension)- నెలకి 4000 రూపాయలు

    11. డప్పు కళాకారుల పెన్షన్ ( Dappu Artists Pension)- నెలకి 4000 రూపాయలు

    12. సికెడియు పెన్షన్ ( C K D U Pension) - నెలకి 10000 రూపాయలు

    13. సైనిక్ సంక్షేమ పింఛన్లు, అమరావతి భూమిలేని పేదల పెన్షన్ - నెలకి 5000 రూపాయలు
    14. అభయహస్తం పెన్షన్ - నెలకి 500 రూపాయలు

    15. గమనిక : * పైన తెలిపిన 14 రకాల పెన్షన్లలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్ పెన్షన్ ( ART (PLHIV) మరియు సికెడియు పెన్షన్ ( C K D U Pension) , సైనిక్ సంక్షేమ పింఛన్లు, అమరావతి భూమిలేని పేదల పెన్షన్ , అభయహస్తం పెన్షన్ తప్ప మిగిలిన 10 రకాల పెన్షన్లు మన గ్రామ /వార్డ్ సచివాలయంలోనే దరకాస్తు చేసుకోవచ్చు.

అర్హత ప్రమాణం ( Eligiibility Criteria )
  • గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి. .

  • నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి. .

  • టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.

  • కుటుంబంలో పెన్షనర్‌ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు.

  • ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.

  • కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  • కుటుంబంలో ఒక్కరికే పెన్షన్‌ కానుకకు అర్హులు.

  • కుటుంబంలో 80 శాతం అంగవైకల్యం గల దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు, మానసికంగా తీవ్రంగా బాధ పడుతోన్న వారు ఫ్యామిలీలో ఉంటే,వారికి కూడా పింఛన్‌ లభిస్తుంది.

1. వృద్ధాప్య పెన్షన్ ( old Age Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

వృద్ధాప్య పెన్షన్ ( old Age Pension) అనగా

  • వృద్ధాప్యంలో ఉన్న పురుషులు, ఆడవారు, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలిగి నిరాశ్రయులైనవారు.

  • నిరాశ్రయులు అనగా జీవనాధారానికి వేరే మార్గం లేకుండా మరియు కుటుంబం లేదా బంధువులు ఆధారపడకుండా జీవించేవారు .

  • ST సామాజిక వర్గానికి చెందిన వారి వయసు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

2. వితంతువు పెన్షన్ (Widow Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

వితంతువు పెన్షన్ (Widow Pension) అనగా

  • వివాహ చట్టం ప్రకారం, 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వుండి భర్త చనిపోయిన మహిళలు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

3. కల్లు/గీత కార్మికుల పెన్షన్ ( Toddy Tappers Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

కల్లు/గీత కార్మికుల పెన్షన్ ( Toddy Tappers Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన గీతకార్మికులు. ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని కలిగి వున్న వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • గీతకార్మికులు అని ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

4. నేత కార్మికులు పెన్షన్ ( Weavers Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

నేత కార్మికులు పెన్షన్ ( Weavers Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన నేత కార్మికులు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • నేత కార్మికులు ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

5. ఒంటరి మహిళ పెన్షన్ ( Single women Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

ఒంటరి మహిళ పెన్షన్ ( Single women Pension) అనగా

  • వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • 35 సంవత్సరాల వయసు పై బడి, తరువాత విడిపోయిన మహిళలు, ఏడాది పాటు సెపరేషన్‌గా ఉన్న మహిళలు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • గ్రామీణ ప్రాంతంలో 30 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు మరియు పట్టణ ప్రాంతంలో 35 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేసిన తేదీ నాటికి విడిపోయే కాలం 1 సంవత్సరానికి మించి ఉండాలి.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం (తహసీల్దార్ గారి నుండి) జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

6. మత్స్యకారుల పెన్షన్ ( Fishermen Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

మత్స్యకారుల పెన్షన్ ( Fishermen Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన మత్స్యకారులు / జాలరి ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • మత్స్య శాఖ నుంచి ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

7. యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్ పెన్షన్ ( ART (PLHIV) Pension) అనగా
  • ఆరు నెలలుగా యాంటీ రాట్రో వైరల్‌ తెరపీ ట్రీట్‌మెంటు తీసుకునే వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

  • ఈ పెన్షన్ ని హాస్పిటల్ ద్వారా దరకాస్తు చేసుకుంటే ప్రభుతం మంజూరు చేస్తుంది .

8. సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ ( Traditional Cobblers Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ ( Traditional Cobblers Pension) అనగా

  • 40 సంవత్సరాల పైబడి వయసు కలిగి మరియు సంక్షేమ శాఖ ద్వారా సాంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రాలు కలిగి వున్న వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • సంక్షేమ శాఖ ద్వారా సాంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

9. వికలాంగుల పెన్షన్ ( Disabled persons Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

వికలాంగుల పెన్షన్ ( Disabled persons Pension) అనగా

  • పూర్తిగా వికలాంగుడు, పక్షవాతం వ్యక్తిని చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేయడం, మరియు తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ప్రమాద బాధితులు ఈ పెన్షన్ ద్వారా 15000 రూపాయలు లభ్ది పొందవచ్చు.

  • వికలాంగత్వం 40 శాతం పైగా వున్న వికలాంగులు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్*

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • సదరం ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

10. ట్రాన్స్ జెండర్ పెన్షన్ ( Transgender Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

ట్రాన్స్ జెండర్ పెన్షన్ ( Transgender Pension) అనగా

  • 18 సంవత్సరాల వయసు పైబడి వైద్య శాఖ సర్టిఫికెట్‌ విధిగా కలిగిన ట్రాన్స్‌జెండర్లు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • వైద్య శాఖ ద్వారా ట్రాన్స్ జెండర్ ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

11. డప్పు కళాకారుల పెన్షన్ ( Dappu Artists Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

డప్పు కళాకారుల పెన్షన్ ( Dappu Artists Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసున్న డప్పు కళాకారులు మరియు సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రాలు కలిగి వున్న వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

12. సికెడియు పెన్షన్ ( C K D U Pension) అనగా
  • దీర్ఘకాలిక వ్యాధులు అనగా, ద్వైపాక్షిక ఎలిఫాంటియాసిస్-గ్రేడ్ 4, కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి, CKDU డయాలసిస్ పై నుండి లేకుండా CKD సీరం క్రియేటినిన్‌ >5 mg, CKDU డయాలసిస్‌పైలేకుండా CKD అంచనా వేసిన GFR <15 ml, CKDU డయాలిసిస్ పైలేకుండా CKD చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ ఈ పెన్షన్ ద్వారా 10000 రూపాయలు లభ్ది పొందవచ్చు.

  • ప్రభుత్వ మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఈ పెన్షన్ ద్వారా 10000 రూపాయలు లభ్ది పొందవచ్చు.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

  • ఈ పెన్షన్ ని హాస్పిటల్ ద్వారా దరకాస్తు చేసుకుంటే ప్రభుతం మంజూరు చేస్తుంది .

13.సైనిక్ సంక్షేమ పింఛన్లు, అమరావతి భూమిలేని పేదలు (Sainik welfare pensions and Amaravathi Landless Poor ) Pension అనగా
  • మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) డిపార్ట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (APCRDA) ప్రాంతంలో భూమిలేని పేదలకు నెలవారీ పెన్షన్‌ను ₹2,500 నుండి ₹5,000కి పెంచింది. ఇది ఫిబ్రవరి 2024 నుండి అమలులోకి వస్తుంది..

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

  • ఈ పెన్షన్ ని మీ సేవ ద్వారా అమరావతిలో వుండే భూమి లేని పేద ప్రజలు దరకాస్తు చేసుకుంటే ప్రభుతం మంజూరు చేస్తుంది .

14.అభయహస్తం (Abhayahastam ) Pension అనగా
  • ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన SHG మహిళలు రోజుకు 1 రూపాయి లేదా సంవత్సరానికి రూ.360 చొప్పున సహకారం అందిస్తారు మరియు ప్రభుత్వం ప్రతి సభ్యునికి సంవత్సరానికి రూ.360 సహ-సహకారం అందిస్తుంది.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు 60 సంవత్సరాలు నిండి ఉండాలి.

  • ఈ పెన్షన్ ని వెలుగు ఆఫీస్ ద్వారా ప్రభుతం మంజూరు చేస్తుంది .

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ( NTR Bharosa pension scheme ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Patta Sub Division - పట్టా సబ్ డివిజన్ విధానం ,అర్హత ప్రమాణం ,కావాల్సిన పత్రాలు , అప్లికేషను ఫారం

Patta Sub Division
Patta Sub Division అనగా
  • ఈ సేవ నే Online Sub Division అని కూడా అంటారు .

  • భూమిని చిన్న ముక్కలుగా విభజించే ప్రక్రియను Patta Sub Division అంటారు.

  • మీకు ఒక సర్వే నెంబర్ మీద భూమి ఉండి , ఆ యొక్క భూమిని మీరు పంచుకున్న యెడల మీరు భూమిని సబ్ డివిజన్ చెయ్యడం ద్వారా సర్వేయర్ వారు సర్వే చేసిన తరువాత ,ఆ రిపోర్ట్ ప్రకారం తహసీల్దార్ గారు వేబ్లాండ్ నందు నమోదు చేస్తారు.

  • ఉదాహరణకు మీకు 120 వ సర్వే నెంబర్ మీద ఒక రెండు ఎకరాలు భూమి ఉంది. ఒక ఇద్దరు సమానంగా ఆ భూమిని పంచుకున్నారు.అప్పుడు భూమిని సబ్ డివిజన్ చేసుకున్న యెడల మీకు రెండు సర్వే నెంబర్ లు ఏర్పడి 120-1లో ఒక ఎకరా మరియు 120-2 లో ఒక ఎకరాగా సర్వేయర్ వారు సర్వే చేసిన తరువాత ,ఆ రిపోర్ట్ ప్రకారం తహసీల్దార్ గారు వేబ్లాండ్ నందు నమోదు చేస్తారు.

  • Patta Sub Division లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.
    1. Patta Subdivision (పట్టా సబ్ డివిజన్) : మీ యొక్క భూమి ఉన్న ప్రాంతం రీ సర్వే గనుక జగకపోతే మీ యొక్క సర్వే నంబరు ద్వారా మీ యొక్క భూమిని పట్టా సబ్ డివిజన్ చేసుకోవచ్చు.
    2. Online Subdivision (ఆన్‌లైన్ సబ్ డివిజన్ ) : మీ యొక్క భూమి ఉన్న ప్రాంతం రీ సర్వే గనుక జరిగి ఉంటే మీ యొక్క LPM నంబరు ద్వారా మీ యొక్క భూమిని పట్టా సబ్ డివిజన్ చేసుకోవచ్చు .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయ కార్యాలయాల్లో ఈ సేవకు దరకాస్తు చేసుకోవచ్చును.

  • Patta Sub Division - పట్టా సబ్ డివిజన్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది.

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టా సబ్ డివిజన్ చేసుకోవాలి అనుకున్న వారు ఆ భూమికి హక్కు దారులు అయ్యి ఉండాలి.

  • ఆ భూమి యొక్క హద్దుదారుల యొక్క పేర్లు ,చిరునామా ,మొబైల్ నెంబర్ మరియు వారి యోక్క్ అడ్రస్ తెలుసుకొని ఉండాలి.

  • ఆ భూమి పొరుగున ఉన్న పట్టాదార్లకు ఉమ్మడి సరిహద్దుకు సంబంధించి ఉపవిభజనకు మరియు ఉపవిభజన ప్రకటనలో సంతకం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండాలి.

  • ఉమ్మడి ఆస్తి విషయంలో వాటాదారులందరూ పట్టా సబ్ డివిజన్ కి సమ్మతి ఇవ్వాలి.

  • దరఖాస్తుదారు భూమిపై క్లియర్ కట్ టైటిల్‌ను సమర్పించాలి.

  • టైటిల్ మరియు స్వాధీనానికి సంబంధించి కోర్టు కేసు లేని చోట పట్టా డివిజన్ ని చేపట్టవచ్చు.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జెరాక్స్*

  • దరఖాస్తుదారుని పట్టాదారు జెరాక్స్ *

  • అడంగాలు నకలు *

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Patta Sub Division (పట్టా సబ్ డివిజన్ ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

OBC Certificate - OBC సర్టిఫికేట్ విధానం ,అర్హత ప్రమాణం ,కావాల్సిన పత్రాలు , అప్లికేషను ఫారం

OBC Certificate
OBC Certificate అనగా
  • ఈ సేవ నే Other Backward Classes (OBC) Certificate అని కూడా అంటారు .

  • ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యున్నతి కోసం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేస్తున్నాయి.

  • ఇతర వెనుకబడిన తరగతులు (OBC) భారతదేశంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. OBCలు షెడ్యూల్డ్ తరగతులు (SC) లేదా షెడ్యూల్డ్ తెగలు (ST) నుండి భిన్నంగా ఉంటాయి.

  • OBC Certificateలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.
    1. Non-Creamy Layer OBC (నాన్-క్రీమీ లేయర్ OBC) : మీరు వెనుకబడిన తరగతులలో ఈ కోవకు చెందిన వారితే మీరు ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు పొందుతారు.
    2. Creamy Layer OBC (క్రీమీ లేయర్ OBC) : మీరు వెనుకబడిన తరగతులలో ఈ కోవకు చెందిన వారితే మీరు ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో ఎటువంటి రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందలేరు .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • OBC సర్టిఫికేట్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది.

నాన్-క్రీమీ లేయర్ OBC కు అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • OBC హోదా ఇవ్వబడిన కులాలు లేదా వర్గాల జాబితాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీ యొక్క కులం ఖచ్చితంగా ఆ జాబితా లో ఉండాలి .
    మీ యొక్క కులం ముందు ఆ జాబితా లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

  • మీ తల్లిదండ్రులు నేరుగా క్లాస్ 1 (గ్రూప్ ఎ) లేదా క్లాస్ 2 (గ్రూప్‌బి) అధికారులుగా నియమించకపోతే లేదా వారు ఎటువంటి రాజ్యాంగపరమైన పోస్టులను (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైనవారు) ఆక్రమించనట్లయితే, మీరు నాన్-క్రీమీ లేయర్ OBC కిందకు వచ్చే అవకాశం ఉంది.

  • మీ తల్లిదండ్రులు ప్రభుత్వం ఉద్యోగం చేయనట్లయితే, వారి ఆదాయాన్ని బట్టి నాన్-క్రీమీ లేయర్ OBC గా పరిగణించబడతారు.

  • OBC నాన్-క్రీమీ లేయర్ అభ్యర్థిగా అర్హత పొందాలంటే, దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

  • OBC నాన్-క్రీమీ లేయర్ హోదా కోసం వార్షిక ఆదాయాన్ని లెక్కించడానికి జీతం మరియు వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయంగా పరిగణించరాదు.అనగా జీతం మరియు వ్యవసాయం కాకుండా ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం ఆదాయ పరిమితి లోపల ఉంటే ఆయా అభ్యర్థులు మాత్రమే OBC నాన్-క్రీమీ లేయర్ గా పరిగణించబడతారు.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జెరాక్స్ *

  • దరఖాస్తుదారుని తల్లి తండ్రుల ఆధార్ కార్డు జెరాక్స్ *

  • దరఖాస్తుదారు తండ్రి/తల్లి ఉద్యోగం వివరాలు/ఆదాయ పన్ను రిటర్న్‌లు (for professionals) *

  • దరఖాస్తుదారు తండ్రి/తల్లి ఆస్తి వివరాలు *

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

OBC Certificate - ( OBC సర్టిఫికేట్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Mutation by Corrections - పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోనుట కు కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mutation by Corrections
Mutation by Corrections అనగా
  • ఈ సేవ నే Mutation by Corrections & Automatic Pattadar Passbook Ordering అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి పట్టాదారు పాసు పుస్తకం ఉన్న యెడల అతనికి / ఆమెకు పొలం పాసు పుస్తకంలో ఏమినా తప్పులు ఉన్న యెడల ఈ సేవ ద్వారా సరిచేసుకోవచ్చు.

  • ఈ సేవ ద్వారా తప్పులు సరి చేసిన పట్టాదారు పాసు పుస్తకం నేరుగా మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పొందవచ్చును.

  • పట్టాదారు పాసుపుస్తకంలో సరిచేసే కొన్ని తప్పులు :
    • పట్టాదారు యొక్క పేరు
    • పట్టాదారు యొక్క ఇంటి పేరు
    • పట్టాదారు యొక్క తండ్రి పేరు
    • పట్టాదారు యొక్క విస్తీర్ణం
    • పట్టాదారు యొక్క అనుభవ స్వభావం
    • పట్టాదారు యొక్క పంట రకం

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోనుట సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారు వారి స్వంత పొలానికి మాత్రమె దరకాస్తు చేసుకోవడానికి అర్హులు.

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారికి తప్పనిసరిగా వారికి ఆ ఊరిలో పట్టాదారు ఖాతా ఉండాలి.

  • పొలం ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారి యొక్క పట్టాదారు ఖాతా కు ఆధార్ నెంబర్ లింకు అయ్యి ఉండాలి.

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారికి ఒక వేల పట్టాదారు ఖాతా కు ఆధార్ నెంబర్ లింకు లేకపోతే , పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ ఎలా లింకు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B

  • రిజిస్ట్రేషన్ పత్రాలు (రిజిస్ట్రేషన్ జరిగితే)*

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mutation by Corrections (పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకొనుట) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Mutation of Pattadar Passbook - భూమి బదలాయింపు కు కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mutation and Automatic Pattadar Passbook Ordering
Mutation of Pattadar Passbook అనగా
  • ఈ సేవ నే Mutation and Automatic Pattadar Passbook Ordering అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి భూమి వేరు వేరు విధాల సంక్రమించి మరియు వేబ్లాండ్ నందు లేని యెడల ఈ సేవ ద్వారా వేబ్లాండ్ లో నమోదు చేసుకోవచ్చు.

  • ఈ సేవ ద్వారా మీరు పట్టాదారు పాసు పుస్తకం నేరుగా మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పొందవచ్చును.

  • భూమి సంక్రమించే విధానాలు :
    • పూర్వీకుల ఆస్తి వారసత్వం ద్వారా
    • వీలుణామా ద్వారా
    • కొనుగోలు వంటి స్వతహాగా సముపార్జన ద్వారా
    • గిఫ్ట్, ట్రస్ట్, సెటిల్మెంట్ డీడ్స్ ద్వారా
    • ప్రభుత్వం ద్వారా గ్రాంట్, ఇనామ్ ద్వారా
    • Partition deed ద్వారా
    • కోర్టు డిక్రీ ద్వారా

  • మ్యుటేషన్ మరియు ఆటోమేటిక్ పట్టాదార్ పాస్‌బుక్ ఆర్డరింగ్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి తప్పనిసరిగా వారికి పైన చెప్పిన విధాలలో ఏదో ఒక విధంగా ఆస్తి సంక్రమించి ఉండాలి.

  • పొలం ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.

  • పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోదలచుకున్న వారు వారి యొక్క ఆదార్ మరియు మొబైల్ నెంబర్ కు లింక్ అయ్యి ఉండాలి లేదా పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోదలచుకున్న వ్యక్తి తన యొక్క బయోమెట్రిక్ దృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం అమ్మిన వారి యొక్క పాసు పుస్తకం నకలు / ROR-1B *

  • పొలం కొన్న వారి యొక్క పాసు పుస్తకం నకలు / ROR-1B

  • రిజిస్ట్రేషన్ పత్రాలు (రిజిస్ట్రేషన్ జరిగితే)*

  • కొన్నవారి/వారసుడి యొక్క పాసుపోర్టు సైజు ఫోటో *

  • కొన్నవారి/వారసుడి యొక్క సంతకం *

  • మరణ ద్రువికరణ పత్రం ( వారసత్వం అయితే)*

  • ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికేట్ ( వారసత్వం అయితే)*

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mutation and Automatic Pattadar Passbook Ordering ( పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Mobile Number & Pattadar Aadhar Seeding - పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mobile Number & Pattadar Aadhar Seeding
Mobile Number & Pattadar Aadhar Seeding అనగా
  • ఈ సేవ నే Pattadar Aadhar Seeding అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి ఒక ఊరిలో పొలం ఉండి అతని యొక్క పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింకు కాని యెడల ఈ సేవ ద్వారా లింకు చేసుకోవచ్చు.

  • పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి ఖచ్చితంగా భూమి ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి.

  • పొలం ఎవరిది అయితే వారు మాత్రమే తమ పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి అర్హులు.

  • పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అనుకున్న వ్యక్తి తన యొక్క బయోమెట్రిక్ దృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mobile Number & Pattadar Aadhar Seeding ( పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అర్హత ప్రమాణం (Eligibility Criteria),కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Labour Certificate
Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అనగా
  • ఈ సేవ నే Application For Integrated Registration Of Establishment Under Labour Laws (SECOND SCHEDULE [Sec.2(d) and Sec4(1)])- FORM A అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తి ఆంద్ర ప్రదేశ్ లో ఏదైనా షాపు నిర్వహిస్తున్న యెడల మరియు అందులో ఎవ్వరికైనా పని ఇచ్చిన యెడల ఆ షాపు అధికారికంగా ( AP Shops and ESTTS, Act 1988 ) ఈ లేబర్ సర్టిఫికేట్ ద్వారా నిర్వహించవచ్చును.

  • ఈ లేబర్ సర్టిఫికేట్ రక రకాల పనులు నిర్వహిస్తున్న వారు తీసుకోవచ్చును.ఉదాహరణకు ఎవ్వరైనా టైలర్ షాపు గాని , లాండ్రీ షాపు గాని , బార్బర్ షాపు గాని ,పిండి మిల్లు గాని , హాస్పిటల్ గాని ,నర్సింగ్ హోం గాని , కిరాణా షాపు గాని ఇంకా ఏ ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న గాని ఈ లేబర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చును.

  • స్థానిక పౌరులు మరియు నివాసితుల ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడానికి లేబర్ లైసెన్స్‌లను ఉపయోగించవచ్చు. విదేశీ కార్మికులు స్థానిక శ్రామిక శక్తిని స్థానభ్రంశం చేయకుండా లేదా తగ్గించకుండా చూసుకోవచ్చు.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం సేవ లేబర్ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లైసెన్స్ హోల్డర్‌కు దేశంలో ఉద్యోగం చేయడానికి చట్టపరమైన అనుమతిని మంజూరు చేస్తుంది. వారు స్థానిక కార్మిక చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని నిర్ధారిస్తుంది.

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఒక వ్యక్తి తప్పనిసరిగా ఏదో ఒక వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తూ వుండాలి..

  • నిర్వహిస్తున్న వ్యాపారం ఇండస్ట్రీ పరిధిలోకి రాకూడదు.

  • లేబర్ సర్టిఫికేట్ ను పునరిద్హరించుకోవడానికి పాత సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • యజమాని ఫోటో మరియు సంతకం *

  • యజమాని ఆధార్ కార్దు నకలు *

  • యజమాని ఇచ్చిన ధృవీకరణ లెటర్ లేదా స్వీయ ధృవీకరణ *

  • షాపు స్థాపన చిరునామా కాపీ *

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Agricultural Income Certificate (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం) కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Agricultural Income Certificate
Agricultural Income Certificate (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం ) అనగా
  • ఈ సేవ నే Agricultural Income అని కూడా అంటారు .

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం పౌరుడికి అతని / ఆమె వార్షిక వ్యవసాయ ఆదాయాన్ని ధృవీకరించే అధికారిక ప్రకటన.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లో అన్ని రకాల వ్యవసాయ వనరుల నుండి ఒక వ్యక్తి / కుటుంబం యొక్క ఆదాయ వివరాలు ఉంటాయి .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • వ్యవసాయ ఆదాయం అనేది వ్యవసాయ భూమి, వ్యవసాయ భూమిపై లేదా వ్యవసాయ భూమితో అనుబంధించబడిన భవనాలు మరియు వ్యవసాయ భూమి నుండి ఉత్పత్తులను కలిగి ఉన్న మూలాల నుండి ఆర్జించే ఆదాయాన్ని సూచిస్తుంది.

  • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(1) వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించింది. అందువల్ల, పన్ను మినహాయింపు యొక్క ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండటం అవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందడం బ్యాంకు రుణం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా, వ్యవసాయ కార్యకలాపాల నుండి ఏవైనా నష్టాలను వచ్చే ఎనిమిది మదింపు సంవత్సరాల వ్యవసాయ ఆదాయంతో భర్తీ చేయవచ్చు.

అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమైన పౌరుడు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం క్లెయిమ్ చేయబడిన ఆదాయం నిర్దేశిత వ్యవసాయ ఆదాయం కిందకు రావాలి.

  • వ్యవసాయ భూమి నుండి వచ్చే ఆదాయం భారతదేశంలో భూమి ఉన్నప్పుడే వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం జారీ కోసం లెక్కించబడుతుంది. హక్కుల రికార్డులో దరఖాస్తుదారు పేరుపై భూమి తప్పనిసరిగా ఉండాలి.

కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Agricultural Income (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail