F-Line (పొలం హద్దులు చూపించుట కొరకు) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line ) అనగా
  • ఈ సేవ నే F-Line Application / Petetion అని కూడా అంటారు .

  • పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line ) సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line ) అనునది ఒక రైతు పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ )లో వుండి ,ఆ రైతు పొలం హద్దులు తెలియని యెడల ఈ సేవ ద్వారా తన పొలం విస్తీర్ణం యొక్క హద్దులు తెలుసుకోవచ్చు .

  • పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line ) అనునది ఒక రైతుకి ఇంకో రైతుకి మధ్యలో వున్న పొలం హద్దుల తగాదాలను నివారించడానికి ఉపయోగపడుతుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line )కు ఆ రైతు యొక్క పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ ) లో వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి మాత్రమే దరకాస్తు చేసుకోగలరు .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి తూర్పు ,పడమర ,ఉత్తరం ,దక్షిణం వున్న సర్వే నంబర్స్ ,వారి వివరాలు (పే రు ,తండ్రి పేరు , మొబైల్ నెంబర్ ,అడ్రెస్స్) తెలిసి వుండాలి .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పట్టాదారు పాస్ బుక్ టైటిల్ డీడ్ జెరాక్స్*

  • దస్తావేజు నకలు


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

    * భిన్న సర్వే నెంబర్లతో ఏక పొలం (ఏక ఖండం)గా వున్న భూమికి ఒక దరకాస్తు మాత్రమె స్వీకరించబడును .

    *పోలముపై నీరు వుండి కొలతలు కొలుచుటకు అనువుగా లేని అర్జీని తాత్కాలికంగా తిరస్కరించిన అర్జీని పునః పరిశీలించబడును



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...