OBC Certificate - OBC సర్టిఫికేట్ విధానం ,అర్హత ప్రమాణం ,కావాల్సిన పత్రాలు , అప్లికేషను ఫారం

OBC Certificate
OBC Certificate అనగా
  • ఈ సేవ నే Other Backward Classes (OBC) Certificate అని కూడా అంటారు .

  • ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యున్నతి కోసం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేస్తున్నాయి.

  • ఇతర వెనుకబడిన తరగతులు (OBC) భారతదేశంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. OBCలు షెడ్యూల్డ్ తరగతులు (SC) లేదా షెడ్యూల్డ్ తెగలు (ST) నుండి భిన్నంగా ఉంటాయి.

  • OBC Certificateలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.
    1. Non-Creamy Layer OBC (నాన్-క్రీమీ లేయర్ OBC) : మీరు వెనుకబడిన తరగతులలో ఈ కోవకు చెందిన వారితే మీరు ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు పొందుతారు.
    2. Creamy Layer OBC (క్రీమీ లేయర్ OBC) : మీరు వెనుకబడిన తరగతులలో ఈ కోవకు చెందిన వారితే మీరు ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో ఎటువంటి రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందలేరు .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • OBC సర్టిఫికేట్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది.


నాన్-క్రీమీ లేయర్ OBC కు అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • OBC హోదా ఇవ్వబడిన కులాలు లేదా వర్గాల జాబితాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీ యొక్క కులం ఖచ్చితంగా ఆ జాబితా లో ఉండాలి .
    మీ యొక్క కులం ముందు ఆ జాబితా లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

  • మీ తల్లిదండ్రులు నేరుగా క్లాస్ 1 (గ్రూప్ ఎ) లేదా క్లాస్ 2 (గ్రూప్‌బి) అధికారులుగా నియమించకపోతే లేదా వారు ఎటువంటి రాజ్యాంగపరమైన పోస్టులను (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైనవారు) ఆక్రమించనట్లయితే, మీరు నాన్-క్రీమీ లేయర్ OBC కిందకు వచ్చే అవకాశం ఉంది.

  • మీ తల్లిదండ్రులు ప్రభుత్వం ఉద్యోగం చేయనట్లయితే, వారి ఆదాయాన్ని బట్టి నాన్-క్రీమీ లేయర్ OBC గా పరిగణించబడతారు.

  • OBC నాన్-క్రీమీ లేయర్ అభ్యర్థిగా అర్హత పొందాలంటే, దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

  • OBC నాన్-క్రీమీ లేయర్ హోదా కోసం వార్షిక ఆదాయాన్ని లెక్కించడానికి జీతం మరియు వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయంగా పరిగణించరాదు.అనగా జీతం మరియు వ్యవసాయం కాకుండా ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం ఆదాయ పరిమితి లోపల ఉంటే ఆయా అభ్యర్థులు మాత్రమే OBC నాన్-క్రీమీ లేయర్ గా పరిగణించబడతారు.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జెరాక్స్ *

  • దరఖాస్తుదారుని తల్లి తండ్రుల ఆధార్ కార్డు జెరాక్స్ *

  • దరఖాస్తుదారు తండ్రి/తల్లి ఉద్యోగం వివరాలు/ఆదాయ పన్ను రిటర్న్‌లు (for professionals) *

  • దరఖాస్తుదారు తండ్రి/తల్లి ఆస్తి వివరాలు *


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

OBC Certificate - ( OBC సర్టిఫికేట్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Mutation by Corrections - పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోనుట కు కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mutation by Corrections
Mutation by Corrections అనగా
  • ఈ సేవ నే Mutation by Corrections & Automatic Pattadar Passbook Ordering అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి పట్టాదారు పాసు పుస్తకం ఉన్న యెడల అతనికి / ఆమెకు పొలం పాసు పుస్తకంలో ఏమినా తప్పులు ఉన్న యెడల ఈ సేవ ద్వారా సరిచేసుకోవచ్చు.

  • ఈ సేవ ద్వారా తప్పులు సరి చేసిన పట్టాదారు పాసు పుస్తకం నేరుగా మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పొందవచ్చును.

  • పట్టాదారు పాసుపుస్తకంలో సరిచేసే కొన్ని తప్పులు :
    • పట్టాదారు యొక్క పేరు
    • పట్టాదారు యొక్క ఇంటి పేరు
    • పట్టాదారు యొక్క తండ్రి పేరు
    • పట్టాదారు యొక్క విస్తీర్ణం
    • పట్టాదారు యొక్క అనుభవ స్వభావం
    • పట్టాదారు యొక్క పంట రకం

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోనుట సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారు వారి స్వంత పొలానికి మాత్రమె దరకాస్తు చేసుకోవడానికి అర్హులు.

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారికి తప్పనిసరిగా వారికి ఆ ఊరిలో పట్టాదారు ఖాతా ఉండాలి.

  • పొలం ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారి యొక్క పట్టాదారు ఖాతా కు ఆధార్ నెంబర్ లింకు అయ్యి ఉండాలి.

  • పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకోవాలి అనుకున్న వారికి ఒక వేల పట్టాదారు ఖాతా కు ఆధార్ నెంబర్ లింకు లేకపోతే , పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ ఎలా లింకు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B

  • రిజిస్ట్రేషన్ పత్రాలు (రిజిస్ట్రేషన్ జరిగితే)*


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mutation by Corrections (పట్టాదారు పాసుపుస్తకంలో తప్పులను సరిచేసుకొనుట) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Mutation of Pattadar Passbook - భూమి బదలాయింపు కు కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mutation and Automatic Pattadar Passbook Ordering
Mutation of Pattadar Passbook అనగా
  • ఈ సేవ నే Mutation and Automatic Pattadar Passbook Ordering అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి భూమి వేరు వేరు విధాల సంక్రమించి మరియు వేబ్లాండ్ నందు లేని యెడల ఈ సేవ ద్వారా వేబ్లాండ్ లో నమోదు చేసుకోవచ్చు.

  • ఈ సేవ ద్వారా మీరు పట్టాదారు పాసు పుస్తకం నేరుగా మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పొందవచ్చును.

  • భూమి సంక్రమించే విధానాలు :
    • పూర్వీకుల ఆస్తి వారసత్వం ద్వారా
    • వీలుణామా ద్వారా
    • కొనుగోలు వంటి స్వతహాగా సముపార్జన ద్వారా
    • గిఫ్ట్, ట్రస్ట్, సెటిల్మెంట్ డీడ్స్ ద్వారా
    • ప్రభుత్వం ద్వారా గ్రాంట్, ఇనామ్ ద్వారా
    • Partition deed ద్వారా
    • కోర్టు డిక్రీ ద్వారా

  • మ్యుటేషన్ మరియు ఆటోమేటిక్ పట్టాదార్ పాస్‌బుక్ ఆర్డరింగ్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి తప్పనిసరిగా వారికి పైన చెప్పిన విధాలలో ఏదో ఒక విధంగా ఆస్తి సంక్రమించి ఉండాలి.

  • పొలం ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.

  • పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోదలచుకున్న వారు వారి యొక్క ఆదార్ మరియు మొబైల్ నెంబర్ కు లింక్ అయ్యి ఉండాలి లేదా పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్ చేసుకోదలచుకున్న వ్యక్తి తన యొక్క బయోమెట్రిక్ దృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం అమ్మిన వారి యొక్క పాసు పుస్తకం నకలు / ROR-1B *

  • పొలం కొన్న వారి యొక్క పాసు పుస్తకం నకలు / ROR-1B

  • రిజిస్ట్రేషన్ పత్రాలు (రిజిస్ట్రేషన్ జరిగితే)*

  • కొన్నవారి/వారసుడి యొక్క పాసుపోర్టు సైజు ఫోటో *

  • కొన్నవారి/వారసుడి యొక్క సంతకం *

  • మరణ ద్రువికరణ పత్రం ( వారసత్వం అయితే)*

  • ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికేట్ ( వారసత్వం అయితే)*


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mutation and Automatic Pattadar Passbook Ordering ( పట్టాదారు పాసు పుస్తకం మ్యుటేషన్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Mobile Number & Pattadar Aadhar Seeding - పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Mobile Number & Pattadar Aadhar Seeding
Mobile Number & Pattadar Aadhar Seeding అనగా
  • ఈ సేవ నే Pattadar Aadhar Seeding అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తికి ఒక ఊరిలో పొలం ఉండి అతని యొక్క పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింకు కాని యెడల ఈ సేవ ద్వారా లింకు చేసుకోవచ్చు.

  • పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి ఖచ్చితంగా భూమి ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి.

  • పొలం ఎవరిది అయితే వారు మాత్రమే తమ పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి అర్హులు.

  • పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అనుకున్న వ్యక్తి తన యొక్క బయోమెట్రిక్ దృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Mobile Number & Pattadar Aadhar Seeding ( పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అర్హత ప్రమాణం (Eligibility Criteria),కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Labour Certificate
Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అనగా
  • ఈ సేవ నే Application For Integrated Registration Of Establishment Under Labour Laws (SECOND SCHEDULE [Sec.2(d) and Sec4(1)])- FORM A అని కూడా అంటారు .

  • ఒక వ్యక్తి ఆంద్ర ప్రదేశ్ లో ఏదైనా షాపు నిర్వహిస్తున్న యెడల మరియు అందులో ఎవ్వరికైనా పని ఇచ్చిన యెడల ఆ షాపు అధికారికంగా ( AP Shops and ESTTS, Act 1988 ) ఈ లేబర్ సర్టిఫికేట్ ద్వారా నిర్వహించవచ్చును.

  • ఈ లేబర్ సర్టిఫికేట్ రక రకాల పనులు నిర్వహిస్తున్న వారు తీసుకోవచ్చును.ఉదాహరణకు ఎవ్వరైనా టైలర్ షాపు గాని , లాండ్రీ షాపు గాని , బార్బర్ షాపు గాని ,పిండి మిల్లు గాని , హాస్పిటల్ గాని ,నర్సింగ్ హోం గాని , కిరాణా షాపు గాని ఇంకా ఏ ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న గాని ఈ లేబర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చును.

  • స్థానిక పౌరులు మరియు నివాసితుల ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడానికి లేబర్ లైసెన్స్‌లను ఉపయోగించవచ్చు. విదేశీ కార్మికులు స్థానిక శ్రామిక శక్తిని స్థానభ్రంశం చేయకుండా లేదా తగ్గించకుండా చూసుకోవచ్చు.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం సేవ లేబర్ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లైసెన్స్ హోల్డర్‌కు దేశంలో ఉద్యోగం చేయడానికి చట్టపరమైన అనుమతిని మంజూరు చేస్తుంది. వారు స్థానిక కార్మిక చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని నిర్ధారిస్తుంది.

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఒక వ్యక్తి తప్పనిసరిగా ఏదో ఒక వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తూ వుండాలి..

  • నిర్వహిస్తున్న వ్యాపారం ఇండస్ట్రీ పరిధిలోకి రాకూడదు.

  • లేబర్ సర్టిఫికేట్ ను పునరిద్హరించుకోవడానికి పాత సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • యజమాని ఫోటో మరియు సంతకం *

  • యజమాని ఆధార్ కార్దు నకలు *

  • యజమాని ఇచ్చిన ధృవీకరణ లెటర్ లేదా స్వీయ ధృవీకరణ *

  • షాపు స్థాపన చిరునామా కాపీ *


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Labour Certificate (లేబర్ సర్టిఫికేట్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Agricultural Income Certificate (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం) కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Agricultural Income Certificate
Agricultural Income Certificate (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం ) అనగా
  • ఈ సేవ నే Agricultural Income అని కూడా అంటారు .

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం పౌరుడికి అతని / ఆమె వార్షిక వ్యవసాయ ఆదాయాన్ని ధృవీకరించే అధికారిక ప్రకటన.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లో అన్ని రకాల వ్యవసాయ వనరుల నుండి ఒక వ్యక్తి / కుటుంబం యొక్క ఆదాయ వివరాలు ఉంటాయి .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • వ్యవసాయ ఆదాయం అనేది వ్యవసాయ భూమి, వ్యవసాయ భూమిపై లేదా వ్యవసాయ భూమితో అనుబంధించబడిన భవనాలు మరియు వ్యవసాయ భూమి నుండి ఉత్పత్తులను కలిగి ఉన్న మూలాల నుండి ఆర్జించే ఆదాయాన్ని సూచిస్తుంది.

  • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(1) వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించింది. అందువల్ల, పన్ను మినహాయింపు యొక్క ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండటం అవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందడం బ్యాంకు రుణం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా, వ్యవసాయ కార్యకలాపాల నుండి ఏవైనా నష్టాలను వచ్చే ఎనిమిది మదింపు సంవత్సరాల వ్యవసాయ ఆదాయంతో భర్తీ చేయవచ్చు.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమైన పౌరుడు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.

  • వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం క్లెయిమ్ చేయబడిన ఆదాయం నిర్దేశిత వ్యవసాయ ఆదాయం కిందకు రావాలి.

  • వ్యవసాయ భూమి నుండి వచ్చే ఆదాయం భారతదేశంలో భూమి ఉన్నప్పుడే వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం జారీ కోసం లెక్కించబడుతుంది. హక్కుల రికార్డులో దరఖాస్తుదారు పేరుపై భూమి తప్పనిసరిగా ఉండాలి.


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

Agricultural Income (వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

LATE REGISTRATION OF BIRTH /DEATH (లేట్ జనన మరియు మరణ దృవపత్రం) కావాల్సిన పత్రాలు , విధానం ,అప్లికేషను ఫారం

Schemes
ఆలస్యమైన మరణ దృవపత్రం ( LATE REGISTRATION OF DEATH ) అనగా
  • ఈ సేవ నే LATE REGISTRATION OF DEATH / BIRTH అని కూడా అంటారు .

  • LATE REGISTRATION OF DEATH సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంబంధిత జనన రిజిస్ట్రార్ దగ్గర గడువు కాలంలో (సుమారుగా 21 రోజులు ,ఫైన్ తో 30 రోజులు ) నమోదు చేసుకొని యెడల వారికి LATE REGISTRATION OF DEATH ద్వారా మరణ ద్రువీకరణ పత్రం మంజూరు చెయ్యవచ్చు.

  • ఈ మరణ ద్రువీకరణ పత్రం ఒక వ్యక్తి ఫలానా తేదీన ఫలానా కారణం చేత ఫలానా ప్రదేశం లో మరణించినారు అని రుజువు క్రింద ఉపయోగపడుతుంది .

  • ముఖ్యంగా ఆ చనిపోయిన వ్యక్తి మీద వున్న ఆస్తులు , బ్యాంకు లో డబ్బులు , ఇంకా ఇతర చనిపోయిన తరవాత వచ్చే భీమా లాభాలు తన వారసులు గాని సహా ధర్మచారిని / సహా ధర్మ చారి గాని పొందడానికి ఈ మరణ ద్రువీకరణ పత్రం ఎంత గానో ఉపయోగపడుతుంది .


ఎలా అప్లై చేసుకోవాలి ? ( How To Apply )
  • ముందుగా సంబంధిత గ్రామ పంచాయతి నుండి గాని ,మునిసిపల్ ఆఫీసు నుండి గాని Non availability certificate తెచ్చుకోవాలి .

  • తరువాత క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తీసుకొని LATE REGISTRATION OF DEATH కి మీ సచివాలయంలో దరకాస్తు చేసుకోవాలి .

  • తరువాత ఫీల్డ్ విచారణ జరిగిన తర్వాత మీకు సంబంధిత రెవిన్యూ డివిజనా్ అధికారి దగ్గర నుండి మీరు ఎక్కడితే దరకాస్తు చేసుకున్నారో అక్కడకి ప్రొసీడింగ్స్ కాపీ వస్తుంది .

  • ఆ తరువాత సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని మీ యొక్క సంబంధిత మరణ రిజిస్ట్రార్ గారిని కలిసిన యెడల మీకు మరణ ధ్రువ పత్రం మంజూరు చేస్తారు .


ఆలస్యమైన మరణ దృవపత్రం ( LATE REGISTRATION OF DEATH ) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • గ్రామ పంచాయతి / మునిసిపల్ కమీషనర్ జారీ చేసిన Non availability certificate *

  • ఆదార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ / SSC జెరాక్స్ / స్వీయ అఫిడవిట్ జెరాక్స్*


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

LATE REGISTRATION OF DEATH(ఆలస్యమైన మరణ దృవపత్రం కొరకు ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


ఆలస్యమైన జనన దృవపత్రం ( LATE REGISTRATION OF BIRTH) అనగా
  • ఈ సేవ నే LATE REGISTRATION OF DEATH / BIRTH అని కూడా అంటారు .

  • LATE REGISTRATION OF BIRTH సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి పుట్టిన తర్వాత సంబంధిత జనన రిజిస్ట్రార్ దగ్గర గడువు కాలంలో (సుమారుగా 21 రోజులు ,ఫైన్ తో 30 రోజులు ) నమోదు చేసుకొని యెడల వారికి LATE REGISTRATION OF BIRTH ద్వారా జనన ద్రువీకరణ పత్రం మంజూరు చెయ్యవచ్చు.

  • ఈ జనన ద్రువీకరణ పత్రం ఒక వ్యక్తి ఫలానా తేదీన ఫలానా కారణం చేత ఫలానా ప్రదేశం లో జన్మించినారు అని రుజువు క్రింద ఉపయోగపడుతుంది .

  • ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి , ఉద్యోగ ప్రయత్నంలో వున్న వారికి , విద్యార్ధులకు ఈ జనన ద్రువీకరణ పత్రం ఎంత గానో ఉపయోగపడుతుంది .


ఎలా అప్లై చేసుకోవాలి ? ( How To Apply )
  • ముందుగా సంబంధిత గ్రామ పంచాయతి నుండి గాని ,మునిసిపల్ ఆఫీసు నుండి గాని Non availability certificate తెచ్చుకోవాలి .

  • తరువాత క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తీసుకొని LATE REGISTRATION OF BIRTH కి మీ సచివాలయంలో దరకాస్తు చేసుకోవాలి .

  • తరువాత ఫీల్డ్ విచారణ జరిగిన తర్వాత మీకు సంబంధిత రెవిన్యూ డివిజనా్ అధికారి దగ్గర నుండి మీరు ఎక్కడితే దరకాస్తు చేసుకున్నారో అక్కడకి ప్రొసీడింగ్స్ కాపీ వస్తుంది .

  • ఆ తరువాత సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని మీ యొక్క సంబంధిత జనన రిజిస్ట్రార్ గారిని కలిసిన యెడల మీకు జనన ధ్రువ పత్రం మంజూరు చేస్తారు .


ఆలస్యమైన జనన దృవపత్రం ( LATE REGISTRATION OF BIRTH) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • గ్రామ పంచాయతి / మునిసిపల్ కమీషనర్ జారీ చేసిన Non availability certificate *

  • రేషన్ కార్డు జెరాక్స్ / SSC జెరాక్స్ / స్వీయ అఫిడవిట్ జెరాక్స్*

  • ఆదార్ కార్డు జెరాక్స్*

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

LATE REGISTRATION OF BIRTH (ఆలస్యమైన జనన దృవపత్రం కొరకు ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail