E- Pass Book Application ( పట్టాదారు పాస్ పుస్తకం ) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

E-Pass Book Application
కొత్త పట్టాదారు పాస్ పుస్తకం / డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం / పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement) (E-Pass Book Application ) అనగా
  • ఈ సేవ నే E-Pass Book Application అని కూడా అంటారు .

  • E-Pass Book Application సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • E-Pass Book Application ముఖ్యంగా మనం మూడు రకాలుగా దారకాస్తు చేసుకోవచ్చు.

    1. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం :

    * ఒకరి భూమి ఇంకొకరి మీదకు మారినప్పుడు (కొనుగోలు ద్వారా గాని , వారసత్వంగా గాని , ఇంకా ఎ విధంగా ఐన ) మొట్ట మొదటి సారిగా పట్టాదారు పాస్ పుస్తకం ఈ సేవ ద్వారా పొందవచ్చు.

    2. డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం

    * ఒక వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుంది ఆ పాసు పుస్తకం నకలు కావాలి అంటే ఈ సేవ ద్వారా పొందవచ్చు .

    3. పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement)

    * ఒక వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుండి ఆ పట్టా దారు పాసు పుస్తకం చిరిగి పోయిన యెడల ,చిరిగోపోయిన పాసుపుస్తకం సరెండర్ చేసి కొత్త పాసు పుస్తకం కావాలి అంటే ఈ సేవ ద్వారా పొందవచ్చు .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • E-Pass Book Application దరకాస్తు కొరకు ఆ రైతు యొక్క పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ ) లో వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి మాత్రమే దరకాస్తు చేసుకోగలరు .


1. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • టాక్స్ రిసిప్ట్స్ ఎవినా వుంటే *

  • పాత పట్టాదారు పాస్ బుక్ టైటిల్ డీడ్ జెరాక్స్*

  • దస్తావేజు నకలు*

  • పట్టాదారుని ఇటీవలి ఫోటో *

  • పట్టాదారుని సంతకం *


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



2. డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఎఫ్ ఐ ఆర్ స్కాన్ నకలు *

  • మీ పరిధిలోని బ్యాంకు నుండి NOC *

  • దస్తావేజు నకలు*

  • పట్టాదారుని ఇటీవలి ఫోటో *

  • పట్టాదారుని సంతకం *


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



3. పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దస్తావేజు నకలు*

  • పట్టాదారుని ఇటీవలి ఫోటో *

  • పట్టాదారుని సంతకం *


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

పొలం పట్టాదారు పాస్ పుస్తకం ( E-Pass Book Application ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


2 comments:

  1. Application Download

    ReplyDelete
    Replies
    1. Thank you for your valuable feedback. If you want more kindly share your idea with us. We will develop for us.

      Delete

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...